అరి – మై నేమ్ ఈజ్ నోబడీ

సనాతన ధర్మం సారాంశంగా రూపొందిన ఆధ్యాత్మిక థ్రిల్లర్ ‘అరి – మై నేమ్ ఈజ్ నోబడీ’ థియేటర్లకు విడుదలకు సిద్ధమైంది.

సనాతన ధర్మం సారాంశంగా రూపొందిన ఆధ్యాత్మిక థ్రిల్లర్ ‘అరి – మై నేమ్ ఈజ్ నోబడీ’ థియేటర్లకు విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్, లిరికల్ సాంగ్స్ మరియు ప్రీమియర్ షోలతో బిజినెస్ సర్కిల్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేసింది.

‘అరి’ అనే టైటిల్, మానవుని లోపలి ఆరుమంది శత్రువులుగా పరిగణించబడే ‘అరిషడ్వర్గాలు’ నుంచి తీసుకున్నారు. ‘కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సర్యం.’ ఈ ఆరుమంది మనోవ్యధలను ప్రతినిధించేటటువంటి పాత్రలు ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులుగా కనిపిస్తారు.

వారు ఎలా అహంకార, కోప, గర్వం వంటి దుర్గుణాలతో నిండి, మానవత్వం కోల్పోయారు? ఎవరి లీల వల్ల వారు మానవత్వం వైపు మళ్లారు? ఎవరు వారి జీవితాల్లో ధర్మాన్ని స్థాపించారు? అన్నదాని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ‘‘మై నేమ్ ఈజ్ నోబడీ’’ అనే క్యాప్షన్, మనిషి ఎగో నిర్ధారణను తేలికగా కానీ లోతుగా వ్యక్తపరిచేలా ఉంటుంది. ఈ చిత్రం ఒక ‘ఆధ్యాత్మిక యాంత్రిక థ్రిల్లర్’ – ధర్మ స్థాపనకు దారితీసే మార్గంలో భగవద్గీత సారాన్ని సృజనాత్మకంగా ఉండ‌నుంది.

ఈ చిత్రానికి కథ, దర్శకత్వం అందించింది కూడా ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్. నిర్మాతలు: ‘శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారం రెడ్డి, లింగ గుణపనేని, మరియు డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల (పీహెచ్‌డీ). ఈ చిత్రాన్ని అర్వి రెడ్డి సమర్పిస్తున్నారు. నిర్మాణ సంస్థలు: అర్వి సినిమాస్, శ్రీ సినిమా స్టూడియోస్.

ఈ సినిమాలో సుమన్, అమనీ, శ్రీకాంత్ అయ్యంగార్, వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, సాయికుమార్, సుభలేఖ సుధాకర్, అనసూయ భరద్వాజ్, వివా హర్ష, రిధిమా పండిట్, మానిక చిక్కల, ఆకాషయ శెట్టి, రాజ్ తీరందాస్.. వంటి ప్రముఖులు నటించారు.

‘అనూప్ రూబెన్స్’ స్వరసుధలతో రూపొందిన సంగీతం ఇప్పటికే సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. కాసర్ల శ్యామ్, వనమాలి రచించిన పదాలు ఆధ్యాత్మికతకు ప్రాణం పోసేలా ఉన్నాయి.

ఇప్ప‌టికే హిట్ అయిన “చిన్నారి కిట్టయ్య” పాట తర్వాత విడుదలైన “భగ భగ” లిరికల్ సాంగ్‌కు కూడా మంచి స్పందన లభిస్తోంది. టీ-సిరీస్ ఈ చిత్ర సంగీత హక్కులను తీసుకుంది. సినిమాటోగ్రఫీ- జి. కృష్ణ ప్రసాద్, జి. శివ కుమార్, ఎడిటింగ్- జి. అవినాష్. ప్రొడక్షన్ డిజైనర్- రాజీవ్ నాయర్, కాస్ట్యూమ్ డిజైనర్-నాగూ, కొరియోగ్రాఫర్- భాను మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్-వినయ్ జ్ఞానమణి. లైన్ ప్రొడ్యూసర్స్ గా-మధుసూదన్ రెడ్డి అంకిరెడ్డి, అనిల్ కుమార్ పి, శివకాంత్, సిమ్మ దుర్గాప్రసాద్ లు పని చేశారు.

‘అరి – మై నేమ్ ఈజ్ నోబడీ’ అన్ని విధాలుగా విడుదలకు సిద్ధమైంది. ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది. ఇందులోని కథా తత్వం, సంగీతం, నటన, నిర్మాణ విలువలు అన్ని కలిపి ఇది ఒక గొప్ప ధ్యానాత్మక ప్రయాణంగా మారింది.

ఈ సినిమా కేవలం కథ కాదు- ఇది ఒక శాశ్వత ధర్మ యాత్ర.. విడుదలకు సిద్ధంగా ఉంది, ధర్మం థియేటర్‌లోకి రాబోతుంది! అని చిత్ర యూనిట్ అంటోంది.

6 Replies to “అరి – మై నేమ్ ఈజ్ నోబడీ”

Comments are closed.