అశ్విన్‌ మళ్ళీ బాదేశాడు

తొలి టెస్ట్‌లోనే సెంచరీ కొట్టి రోహిత్‌ శర్మ టీమిండియాకి కొండంత బలంగా నిలిస్తే, తానేం తక్కువ తిన్లేదని చెన్నయ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ నిరూపించాడు కోల్‌కతా టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో. అశ్విన్‌ కెరీర్‌లో రెండో సెంచరీని…

తొలి టెస్ట్‌లోనే సెంచరీ కొట్టి రోహిత్‌ శర్మ టీమిండియాకి కొండంత బలంగా నిలిస్తే, తానేం తక్కువ తిన్లేదని చెన్నయ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ నిరూపించాడు కోల్‌కతా టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో. అశ్విన్‌ కెరీర్‌లో రెండో సెంచరీని నమోదు చేయడంతో భారత్‌ భారీ స్కోర్‌ దిశగా దూసుకుపోతోంది.

వెస్టిండీస్‌తో కోల్‌కతాలో జరుగుతోన్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో అద్భుతాలే చోటు చేసుకుంటున్నాయి. అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌ అంతా చేతులెత్తేస్తే, టెయిల్‌ ఎండర్లు చితక్కొట్టేస్తుండడం విశేషం కాక మరేమిటి.? సచిన్‌ నిరాశపర్చాడు, ధోనీ ఫర్వాలేదన్పించాడు. వన్‌ టూ ఫైవ్‌ ఎవరూ హాఫ్‌ సెంచరీ కాదు కదా, కనీసం 30 పరుగులు కూడా ఒకొక్కరూ చేయలేకపోయారు.

156 పరుగులకి ఆరు వికెట్లు పడిపోయాయంటే, 200 పరుగుల లోపే టీమిండియా దుకాణం సర్దేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అనూహ్యంగా రోహిత్‌ శర్మ సెంచరీ కొడితే, షాకింగ్‌గా అశ్విన్‌ కూడా సెంచరీ బాదేశాడు. 436 పరుగుల స్కోర్‌ వద్ద టీమిండియా ఏడో వికెట్‌ కోల్పోయింది రోహిత్‌శర్మ రూపంలో.

రోహిత్‌ శర్మ 177 పరుగులు చేసి ఔట్‌ కాగా, తరువాత అశ్విన్‌  కూడా 124 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు . చివరి బ్యాట్స్‌మన్‌ కూడా ఎంతో సమయం నిలువలేక పోయారు.మొత్తానికి 434 పరుగుల వద్ద ఆలౌట్‌ అయ్యింది, దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగుల ఆధిక్యం లభించింది.