కొరటాలకి ఇంకా ఛాన్సుందట

ఎన్టీఆర్‌ – కొరటాల శివ సినిమా అటకెక్కేసినట్టే అని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. మిర్చి దర్శకుడు మెహంలో కళ తప్పింది. అయితే… “ఈ సినిమా ఉంది.. ఎక్కడికీ పోలేదు” అంటున్నాడీ దర్శకుడు. “ముందు…

ఎన్టీఆర్‌ – కొరటాల శివ సినిమా అటకెక్కేసినట్టే అని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. మిర్చి దర్శకుడు మెహంలో కళ తప్పింది. అయితే… “ఈ సినిమా ఉంది.. ఎక్కడికీ పోలేదు” అంటున్నాడీ దర్శకుడు. “ముందు మహేష్‌ తో సినిమా చేస్తా. ఆ తరవాత ఎన్టీఆర్‌తో ఉంటుంది. ఎన్టీఆర్‌ చేతిలో చాలా సినిమాలున్నాయి. అవి పూర్తయ్యే సరికి సమయం పడుతుంది. ఈలోగా నేను మహేష్‌ సినిమా పూర్తి చేస్తా” అంటున్నాడు శివ. 

మహేష్‌ సినిమా 2014 జూన్‌లోగానీ మొదలవ్వదు. యేడాది అయినా ఈ సినిమాకి కేటాయించాల్సిందే. అంటే  ఎన్టీఆర్‌తో సినిమా 2016లోనే అన్నమాట. అప్పటి వరకూ ఏ సమీకరణాలు ఎలా మారతాయో చెప్పలేం. అయితే జూన్‌ వరకూ కొరటాల శివ సినిమాలేం లేకుండా గడుపుతాడా?  లేదంటే మరో సినిమాని టేకాఫ్‌ చేస్తాడా?  అనేది తేలాల్సివుంది.