పవన్‌ వంద కోట్లు కొట్టేస్తాడట..

‘అత్తారింటికి దారేది’ వంద కోట్లు సాధిస్తుందా?  టాలీవుడ్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమాగా సంచలనం సృష్టిస్తుందా? ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ అభిమానులంతా.. ఇదే అంశంపై ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. వాళ్ల లెక్కలు ఎలా…

‘అత్తారింటికి దారేది’ వంద కోట్లు సాధిస్తుందా?  టాలీవుడ్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమాగా సంచలనం సృష్టిస్తుందా? ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ అభిమానులంతా.. ఇదే అంశంపై ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. వాళ్ల లెక్కలు ఎలా ఉన్నా.. నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మాత్రం అత్తారింటికి వంద కోట్లు సాధించడం ఖాయం అంటున్నారు. 

‘అత్తారింటికి దారేది’ 25 రోజులు పూర్తి చేసుకొన్న సందర్భంగా ప్రసాద్‌ విూడియాతో మాట్లాడారు. అందరూ వంద కోట్ల గురించి మాట్లాడుతున్నారు.. మా సినిమా ఆ మైలురాయి అందుకొనే అవకాశాలున్నాయి. అని హింట్‌ ఇచ్చేశారు. 

సమంత కూడా ఇదే మాట చెబుతోంది. యాభై రోజుల్లో సాధించవలసిన    వసూళ్లు పాతిక రోజుల్లోనే అందుకొంది. ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం అని ధీమాగా చెబుతోంది. మరి పవన్‌ వంద కోట్లు సాధిస్తాడా? సాధిస్తే ఎన్ని రోజుల్లో…? అనేదే ఇప్పుడు కీలకమైన ప్రశ్న.