“నేను హీరోని అయినా, కాకపోయినా పవన్ కల్యాణ్ ఫ్యాన్ ని. ఎప్పటికీ అదే మాట చెబుతాను. కొంతమందిలా ఓ స్టేజ్ కు వెళ్లిన తర్వాత పేరు ప్రస్తావించకుండా వదిలేయడం లాంటివి చేయను. నేను ఓ సాధారణ కుర్రాడిలా వచ్చాను. ఒకసారి ఫ్యాన్ అంటే, లైఫ్ లాంగ్ ఫ్యాన్ అని అర్థం. ఇప్పుడు అభిమానినని చెప్పుకొని, రేపు ఉదయం ఓ రేంజ్ వచ్చిన తర్వాత నేను ఫ్యాన్ ను కాదు, నాకు నేనే అభిమానిని అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. నేనైతే అలా చెప్పను, నాది అలాంటి క్యారెక్టర్ కాదు. నేను ఎప్పటికీ పవన్ కల్యాణ్ ఫ్యాన్.”
నితిన్ తాజా స్టేట్ మెంట్ ఇది. ఇందులో కొత్తదనం కూడా లేదు. ఎందుకంటే, నితిన్ ఎన్నోసార్లు పవన్ పై తన ప్రేమను చాటుకున్నారు. ఈసారి కూడా అదే చెప్పారు. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ స్టేట్ మెంట్ ను బన్నీ ఫ్యాన్స్ కు ట్యాగ్ చేస్తున్నారు.
కెరీర్ స్టార్టింగ్ లో పవన్ కల్యాణ్ ను పొగిడి, ఓ స్థాయి వచ్చిన తర్వాత 'చెప్పను బ్రదర్' అనడం కరెక్ట్ కాదని.. నితిన్ ను చూసి నేర్చుకోవాలంటూ అతడి స్టేట్ మెంట్ ను వైరల్ చేస్తున్నారు. దీంతో బన్నీ అభిమానులు రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేశారు.
తన ప్రసంగాల్లో పవన్ చెప్పిన కొన్ని విరుద్ధ వ్యాఖ్యల్ని తెరపైకి తీసుకొస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. చిరంజీవి అంటే ఇష్టమని కొన్నిసార్లు చెప్పిన పవన్, మరికొన్ని సందర్భాల్లో చిరంజీవిపై నెగెటివ్ గా చేసిన వ్యాఖ్యల్ని కట్ చేసి వైరల్ చేస్తున్నారు.
దీంతో నితిన్ ఇచ్చిన స్టేట్ మెంట్.. బన్నీ-పవన్ ఫ్యాన్స్ మధ్య సరికొత్త సోషల్ మీడియా యుద్ధానికి దారితీసింది. పుష్ప-2 తర్వాత బన్నీ, పవన్ ను మించిపోతాడని అతడి ఫ్యాన్స్ చెబుతుంటే.. ఎప్పటికీ పవన్ స్థాయిని బన్నీ అందుకోలేడని పవన్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు.