హరోం.. హర.. కొత్త ఫీల్

సుధీర్ బాబు హీరోగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మించిన వైవిధ్యమైన సినిమా హరోం హర. ఈ బలమైన భావోద్వేగ యాక్షన్ సినిమాకు సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం…

సుధీర్ బాబు హీరోగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మించిన వైవిధ్యమైన సినిమా హరోం హర. ఈ బలమైన భావోద్వేగ యాక్షన్ సినిమాకు సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా హీరో సుధీర్ బాబు మీడియాతో తన అనుభవాలు పంచుకున్నారు. ‘హరోం హర’ వరల్డ్ బిల్డింగ్, బ్యాక్ డ్రాప్ చాలా ఫ్రెష్ గా వుంటుంది. తన క్యారెక్టర్ ఆడియన్స్ కి గుర్తుండిపోతుందని, తెలుగులో వచ్చిన టాప్ టెన్ యాక్షన్ సినిమాల్లో హరోం హర కచ్చితంగా స్ధానం సంపాదించుకుంటుంది అని ఆయన నమ్మకంగా చెప్పారు.

దర్శకుడు కథ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా ఏదైనా లవ్ స్టొరీ చెప్తారేమో అనుకున్నాను. హరోం హర కథ చెప్పిన తర్వాత చిన్న షాక్ కి గురయ్యాను. తర్వాత అతను ముందుగా చేసిన సెహరి చూశాను. హరోం హర వరల్డ్ బిల్డింగ్ తనకి ఇంకా ఈజీ అనిపించింది. తను కుప్పం నుంచే వచ్చారు. జనరల్ గా నాకు కథ నచ్చితే మరో ఆలోచన లేకుండా చేసేస్తాను. అందుకే చేసేసాను.

హరోం హర చాలా అథంటిక్ గా చేసిన కమర్షియల్ సినిమా. ఆడియన్స్ కి ఓ కొత్త వరల్డ్ చూసిన ఫీల్ వస్తుంది. ట్రైలర్ చూసి మహేష్ కూడా ఇదే అన్నారు. వరల్డ్ బిల్డింగ్, బ్యాక్ డ్రాప్ ఫ్రెష్ గా వున్న సినిమాలని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని చెప్పారు.

కమర్షియల్ సినిమా చేసినా కథ నుంచి ఓ హీరో పుట్టడమే నా ప్రయారిటీ. ఇందులో కథలో నుంచే ఒక కమర్శియాలిటీ వుంటుంది. బ్యాక్ డ్రాప్ చాలా ఫ్రెష్ గా వుంటుంది. ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో తెలుగులో ఏ సినిమా రాలేదని నా ఫీలింగ్. ఇది బిగ్గర్ యూఎస్పీ. జేమ్స్ బాండ్ లాంటి క్యారెక్టర్ చాలా హెవీ వెపన్స్, గాడ్జెట్స్ తయారు చేస్తుంటారు. అలాంటి క్యారెక్టర్ మన వూర్లో వుంటే. మన పక్కింటి కుర్రాడిలా తను గన్స్ తయారు చేస్తే కొంచెం నాటుగా రా గా వుంటుంది. దిన్ని జేమ్స్ బాండ్ బ్యాక్ డ్రాప్ ఇన్ కుప్పం అనొచ్చు.

దర్శకుడు ఈ కథని రాసుకున్నపుడు ఆ పిరియడ్ నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఇందులో హీరో ల్యాబ్ అసిస్టెంట్. ఆ రోజుల్లో తనకి గన్ తయారూ చేసే నాలెడ్జ్ వుందని చూస్తునపుడు అర్ధమైపోతుంది. 80 బ్యాక్ డ్రాప్ అథంటిసిటీని తీసుకొచ్చింది. ఇప్పటివరకూ కొన్ని తప్పులు చేశాం. కానీ ఇందులో అలాంటి తప్పు ఒక్కటీ వుండదు. ఇది బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ సినిమా. ఆడియన్స్ ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్తారు. ఈ సినిమా చాలా కాన్ఫిడెనన్స్ వుంది.

తెలుగులో వచ్చిన టాప్ టెన్ యాక్షన్ సినిమాల్లో హరోం హర వుంటుంది. టాప్ 5 లో వున్నా సర్ ప్రైజ్ అవ్వను. అంత నమ్మకంగా వున్నాం. ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ తో రండి. ఎక్స్ పెక్టేషన్స్ ని అందుకుంటుంది. యాక్షన్ లవర్స్ కి పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుంది. మంచి ఎమోషన్, యాక్షన్ తో అందరికీ నచ్చే సినిమా ఇది.

ఫిజిక్ వైజ్ ఈ సినిమాలో చూపించడం లేదు. క్యారెక్టర్ స్ట్రెంత్ కథ నుంచే వస్తుంది. ఇక ప్రతి సినిమాకి ఫిజిక్ విషయంలో తీసుకునే కేర్ గురించి చెప్పాలంటే.,. చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు హీరో అంటే ఇలా వుండాలనే ఓ అభిప్రాయం వుండేది. నేను అలా ఉండటానికి ట్రై చేస్తున్నానంతే. అలాగే క్యారెక్టర్స్ కూడా కొన్ని సార్లు మొటివేట్ చేస్తాయి.

సినిమాలో ఒక గాడ్ లేయర్ కూడా వుంటుంది. ఒక ఊరులో ఓ సమస్య వుంటుంది. ఆ సమస్యని ఓ వ్యక్తి తీరుస్తాడు. ఆయన ఆక్కడి ప్రజలకు దేవుడిలా అనిపిస్తాడు. ఆ వూర్లో అందరూ సుబ్రహ్మణ్యం స్వామి భక్తులు. అలాగే ఇందులో ఓ నెమలి ఎలిమెంట్ కూడా వుంటుంది. అయితే ఇవి కోఇన్సీడెంట్ గా వుంటాయి. షూటింగ్ కోసం కుప్పంతో పాటు అలా కనిపించే లోకేషన్స్ కి వెళ్లాం. మంగుళూర్, ఉడిపి, రాజమండ్రిలో షూట్ చేశాం.

ఫైనల్ అవుట్ పుట్ చూశాక ఇప్పటివరకూ ఏ సినిమాకి రాని సంతృప్తి వచ్చింది. ఈ సినిమా స్టెప్ ఇంత భారీగా తీసున్నామా అనిపించేది. కలర్ పేలట్ చూసిన తర్వాత చాలా కొత్తగా అనిపించింది. ఫైనల్ పుట్ పుట్ చూశాక అద్భుతం అనిపించింది. టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ గా వుంటుంది. అవుట్ పుట్ చూశాక దర్శకుడికి వందకు వంద మార్కులు వేయాల్సిందే. ట్రైలర్ చూసినప్పుడు ఆడియన్స్ ఎంత ఎఫెక్టివ్ గా ఫీలయ్యారో సినిమా చూసినప్పుడు కూడా అంతే ఎఫెక్టివ్ గా సర్ ప్రైజింగ్ గా వుంటుంది.

చేతన్ భరద్వాజ్ మరో అనిరుద్ లా సెట్ అయిపోతాడు. విక్రమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఎంత సపోర్ట్ చేసిందో.. ఈ సినిమాకి చేతన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత బలాన్ని ఇస్తుంది. ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ఆడియన్స్ కి గుర్తుండిపోతుంది. దీనికి మెయిన్ రీజన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.