టీచర్లలో అసంతృప్తికి బీజం పడుతోందా?

తమ సూచనలు పట్టించుకోనప్పుడు, తమను చర్చలకు ఎందుకు పిలిచారనే ప్రశ్నలు కూడా టీచర్ల సంఘాలు వేస్తున్నాయి.

సాధారణంగా రాజకీయ పార్టీల భవిష్యత్తు నిర్ణయించే కీలక ఫ్యాకర్లలో టీచర్లు కూడా తప్పకుండా ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టీచర్లలో వ్యతిరేకతను మూటగట్టుకుంది. దాదాపుగా వారందరూ కూడా జగన్ ప్రభుత్వాన్ని ద్వేషించారు. పార్టీ ఓడిపోవడానికి దారితీసిన కారణాల్లో అది కూడా ఒకటి.

అలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూడా టీచర్లలో అసంతృప్తికి బీజం వేస్తున్నదా అనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు పని సర్దుబాటు నిమిత్తం తాజాగా విడుదలైన మార్గదర్శకాల పట్ల ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది.

సోమవారం నుంచి టీచర్ల సర్దుబాటు ప్రక్రియమొదలు కాబోతోంది. అయితే.. జీవో నెంబరు 117ను రద్దు చేయడం గురించి ఉపాధ్యాయ సంఘాలన్నీ కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. ఆ అంశాన్ని ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. మిగులు టీచర్లను సర్దుబాటు చేస్తారు. ఒకరుకంటె ఎక్కువ ఉండే సిబ్బందిని ఇతర స్కూళ్లకు పంపుతారు. ఇలా రకరకాల విధివిధానాలు ఖరారయ్యాయి.

అయితే ఉపాధ్యాయ సంఘాలు మాత్రం గుర్రుమంటున్నాయి. గతంలో ప్రభుత్వం విడుదల చేసి, సంఘాలు తిరస్కరించిన, వ్యతిరేకించిన నిబంధనలనే చర్చల తర్వాత మళ్లీ యథాతథంగా విడుదల చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ఒక్క మార్పు మాత్రం చేశారని అంటున్నారు. తమ సూచనలు పట్టించుకోనప్పుడు, తమను చర్చలకు ఎందుకు పిలిచారనే ప్రశ్నలు కూడా టీచర్ల సంఘాలు వేస్తున్నాయి.

చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం అనే మాటతో ఉపాధ్యాయ వర్గాలను, నిరుద్యోగ ఉపాధ్యాయులను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకుని నోటిఫికేషన్ ఇచ్చారు కూడా. కానీ అదే సమయంలో ఉపాధ్యాయవర్గాల్లోనే వ్యతిరేకతను పెంచే పనులకు కూడా శ్రీకారం దిద్దుతున్నట్టుగా ఉంది. ఆ వర్గంలో వ్యతిరేకత వస్తే పార్టీకి చేటు తప్పదేమో అని పలువురు కార్యకర్తలు భయపడుతున్నారు.

9 Replies to “టీచర్లలో అసంతృప్తికి బీజం పడుతోందా?”

  1. కత్తి తిప్పడం రాని వారి ఖడ్గ ప్రహారాల గురించి ఇన్ని వరహాల అక్షరాలు అవసరమా ?

  2. ఇప్పుడు మన అన్నయ్య వుంటే ఎంత బావుండేది అని కూడా ఫీల్ అవుతున్నారు అని చెప్పటం మర్చిపోయావా GA….😂😂😂

  3. ఎంత అసంతృప్తి పెరిగినా జగన్ కి మాత్రం వోట్ వేసే ప్రశ్నే లేదు. మాకు నరకం చూపించాడు.

Comments are closed.