బీఆర్ఎస్ భ‌విష్య‌త్‌పై సంచ‌ల‌న జోష్యం!

బీఆర్ఎస్‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న జోష్యం చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం త‌థ్యం అని రేవంత్‌రెడ్డి మ‌రోసారి స్ప‌ష్టం చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తెలంగాణ‌లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య మైండ్‌గేమ్ ఓ…

బీఆర్ఎస్‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న జోష్యం చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం త‌థ్యం అని రేవంత్‌రెడ్డి మ‌రోసారి స్ప‌ష్టం చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తెలంగాణ‌లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య మైండ్‌గేమ్ ఓ రేంజ్‌లో సాగుతోంది. త్వ‌ర‌లో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు ప‌డుతుంద‌ని, ఉప ఎన్నిక‌లు త‌ప్ప‌వ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప‌దేప‌దే అంటున్నారు.

దీనికి కౌంట‌ర్ అన్న‌ట్టుగా రేవంత్‌రెడ్డి విలీనం గురించి పదేప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, అనంత‌రం ఎవ‌రెవ‌రికి ఏ ప‌ద‌వులు వ‌స్తాయో కూడా చెప్పారు.

కేసీఆర్‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి, కేటీఆర్‌కు కేంద్రంలో మంత్రి ప‌ద‌వి వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేశారు. మేన‌ల్లుడు హ‌రీష్‌రావుకు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి ప‌ద‌వి ద‌క్కుతుంద‌న్నారు. ఇదే సంద‌ర్భంలో కేసీఆర్ కుమార్తె క‌విత‌కు నాలుగు రాజ్య‌స‌భ సీట్ల‌తో స‌మానంగా బెయిల్ వ‌స్తుంద‌ని దెప్పి పొడిచారు. బీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో విలీనం అయ్యే అవ‌కాశం వుంద‌ని రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే త‌న అభిప్రాయాల్ని బీఆర్ఎస్ నేత‌లు ఖండించొచ్చ‌ని, కానీ ఎప్ప‌టికైనా జ‌రిగి తీరుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల విలీనం వార్త‌ల్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించిన సంగ‌తి తెలిసిందే. బీజేపీలో త‌మ పార్టీని విలీనం చేయాల్సిన ఖ‌ర్మ ప‌ట్ట‌లేద‌న్నారు. ఇంకా 50 ఏళ్లు బీఆర్ఎస్ పేరుతోనే రాజ‌కీయాలు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయిన‌ప్ప‌టికీ రేవంత్‌రెడ్డి మాత్రం విలీనం అంశాన్ని విడిచిపెట్ట‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

5 Replies to “బీఆర్ఎస్ భ‌విష్య‌త్‌పై సంచ‌ల‌న జోష్యం!”

  1. If Congress does not complete the implementation of free schemes then RR government will collapse by June next year. Public is already irritated with no development and no welfare.

Comments are closed.