వరుస ఫ్లాపులకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు అక్షయ్ కుమార్. ఒకప్పుడు వంద కోట్ల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం ఆపసోపాలు పడుతున్నాడు. రీసెంట్ గా ఎపిక్ డిజాస్టర్లు కూడా ఇచ్చాడు.
ఇలా కెరీర్ లో ఇబ్బంది పడుతున్న అక్షయ్, ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అతడి గత చిత్రాలతో చావు దెబ్బ తిన్న ఆడియన్స్, ఈసారి పూర్తిగా ముఖం చాటేశారు. హీరోయిన్లతో కలిసి గట్టిగా చేసినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదు.
అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే.. ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాకు మొదటి రోజు ఓ మోస్తరు టాక్ వచ్చింది. సినిమా హిట్టవ్వకపోయినా, అక్షయ్ గత చిత్రాలతో పోలిస్తే ఇది చాలా బెటరన్నారు కొంతమంది.
దీంతో యూనిట్ తో పాటు, అక్షయ్ లో కూడా కాస్త ఆశ చిగురించింది. అయితే ఆ ఆనందాన్ని ఒక్క రోజు కూడా నిలవనీయలేదు స్త్రీ-2. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు నటించిన ఈ సినిమా అక్షయ్ మూవీని పూర్తిగా తొక్కిపడేసింది.
మొదటి రోజు అక్షయ్ సినిమాకు కేవలం 5 కోట్ల రూపాయల నెట్ రాగా, స్త్రీ-2 సినిమాకు ఏకంగా రూ.55.40 కోట్లు వసూళ్లు వచ్చాయి. నిన్న ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాకు కేవలం రూ. 2 కోట్లు రాగా.. స్త్రీ-2 సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది.
శ్రద్ధా కపూర్ సినిమా రేసులో లేకపోతే అక్షయ్ కుమార్ సినిమా ఫ్లాప్ అయినా, కనీసం మంచి ఓపెనింగ్స్ వచ్చి ఉండేవి. ఇప్పుడా అవకాశం లేదు. ‘ఖేల్ ఖేల్ మే’ రెండో రోజుకే పూర్తిగా క్రాష్ అయింది. అక్షయ్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరింది.
Vc estanu 9380537747
Call boy jobs available 8341510897
హ హ హ…
అందుకే డైరెక్ట్ ఓటిటిలో చెయ్యాల్సింది