కొన్ని అవకాశాలు అనుకున్నంత ఈజీగా రావు. చాన్నాళ్లు ఎదురుచూడాల్సి వస్తుంది. మ్యూజిక్ డైరక్టర్ మిక్కీ జే మేయర్ కూడా అలానే ఎదురుచూశాడు. ఎట్టకేలకు అవకాశం అందుకున్నాడు.
తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న టైమ్ లోనే రవితేజ సినిమాకు సంగీతం అందించే ఆఫర్ వచ్చిందట. అన్నీ అనుకున్నట్టు జరిగితే కిక్ సినిమాకు మిక్కీనే మ్యూజిక్ అందించాల్సి ఉంది. ఈ మేరకు దర్శకుడు సురేందర్ రెడ్డితో చర్చలు కూడా పూర్తయ్యాయి.
అయితే అనుకోని కారణాల వల్ల ఆ సినిమా అవకాశం మిస్సయిందని వెల్లడించాడు మిక్కీ జే మేయర్. అప్పట్నుంచి రవితేజ సినిమా కోసం ఎదురుచూస్తున్న తనకు మిస్టర్ బచ్చన్ తో అవకాశం వచ్చిందని తెలిపాడు.
సినిమా ఫెయిలైనా, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో 4 పాటల్ని జస్ట్ వారం రోజుల్లో కంపోజ్ చేశాడట ఈ సంగీత దర్శకుడు. అమెరికాలో ఉంటున్న మిక్కీ దగ్గరకు హరీశ్ వెళ్లాడట. అలా ఇద్దరూ కలిసి వారంలో 4 పాటలు పూర్తిచేశారు.
ఈ సందర్భంగా ఓ చిన్న క్లారిటీ ఇచ్చాడు మిక్కీ జే మేయర్. మాస్ సాంగ్స్ చేయడం తనకు తెలుసని, ఎటొచ్చి మేకర్స్ తనను ఆ కోణంలో చూడడం లేదని అంటున్నాడు.
Vc available 9380537747
ఏంటి తీరింది … దూలా
రవితేజ సినిమాకు పని చేసే అవకాశం కోసం ఎదురు చూస్తే ఇప్పుడు అవకాశం ఒచ్చిందంట
అంటే రవితేజ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం కోటి జన్మల పుణ్యఫలమా?
ప్రేక్షకులు ఎవ్వరూ రవితేజ సినిమాల కోసం ఎదురు చూడట్లేదు, ఈయనకెందుకో అంత ప్రేమ
ఫైనల్ గా డిస్ట్రిబ్యూటర్లకి మూడింది.
Call boy works 8341510897
జనం పట్టించుకోరు