ఏపీలో ఉద్యోగుల బ‌దిలీల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ బ‌దిలీల‌కు కూట‌మి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం గైడ్‌లైన్స్ కూడా విడుద‌ల చేసింది. మొత్తం 15 శాఖ‌ల్లో బ‌దిలీలు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఐదేళ్లు ఒకే చోట…

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ బ‌దిలీల‌కు కూట‌మి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం గైడ్‌లైన్స్ కూడా విడుద‌ల చేసింది. మొత్తం 15 శాఖ‌ల్లో బ‌దిలీలు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఐదేళ్లు ఒకే చోట ప‌నిచేసిన వారికి బ‌దిలీలు త‌ప్ప‌నిస‌రి. ఈ నెల 17 నుంచి 31వ లోపు బ‌దిలీల ప్ర‌క్రియ పూర్తి కావాల్సి వుంది.

సెప్టెంబర్ ఒక‌టి నుంచి బదిలీల బ్యాన్ అమల్లోకి వస్తుంది. ఇదిలా వుండ‌గా ప్ర‌జా సంబంధిత శాఖ‌ల ఉద్యోగుల బ‌దిలీలు మాత్ర‌మే జ‌ర‌గ‌నున్నాయి. ఉపాధ్యాయులు, వైద్యారోగ్య‌శాఖ‌ల ఉద్యోగుల బ‌దిలీలు లేన‌ట్టే అని చెబుతున్నారు. గిరిజ‌న ప్రాంతాల్లో రెండేళ్ల పాటు ప‌ని చేసిన ఉపాధ్యాయుల‌ను బ‌దిలీ చేయ‌నున్నారు.

అంధులైన ఉద్యోగుల‌కు బ‌దిలీల్లో మిన‌హాయింపు వుంటుంది. వారు కోరుకున్న చోటికి బ‌దిలీ చేసుకోవ‌చ్చు. అలాగే దంప‌తులైన ఉద్యోగులకు బ‌దిలీల్లో ప్రాధాన్యం వుంటుంది. బ‌దిలీల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉద్యోగుల‌కు ఇది శుభ‌వార్తే.

ఐదేళ్లు ఒకేచోట ప‌ని చేసిన వారికి స్థాన చ‌ల‌నం త‌ప్ప‌దు. అలాగే వేర్వేరు చోట్ల ప‌ని చేస్తున్న ఉద్యోగ దంప‌తులు, ఒకే చోటికి రావ‌డానికి ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పిస్తోంది.

8 Replies to “ఏపీలో ఉద్యోగుల బ‌దిలీల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌”

    1. లాస్ట్ ఇయర్ కూడా ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు కదా! దీనికి కూడా బాకాలేనా సార్ 🤔

  1. బదిలీ అయ్యే ముందర ప్రతి ఉద్యోగి తమవంతుగా ఒక నాలుగు files ని దగ్ధం చేయడంతో పాటు ఆ దారిద్రపుగొట్టు red book ని కూడా దహనం చేసి పోతే రాష్ట్రానికి పట్టిన శని విరగడవుతుంది. ఎలాగూ చేతగాని ప్రభుత్వం ఆరోపణలకు, మేకపోతు గాంభీర్యాలకే పరిమితమవుతుంది.

  2. బదిలీ అయ్యే ముందర ప్రతి ఉద్యోగి తమవంతుగా ఒక నాలుగు files ని దగ్ధం చేయడంతో పాటు ఆ దారిద్రపుగొట్టు red book ని కూడా దహనం చేసి పోతే రాష్ట్రానికి పట్టిన శbని విరగడవుతుంది. ఎలాగూ చేతగాని ప్రభుత్వం ఆరోపణలకు, మేకపోతు గాంభీర్యాలకే పరిమితమవుతుంది.

Comments are closed.