జగన్ మీద మండిపోతున్న బీజేపీ రాజు గారు

బీజేపీ రాజు అంటే ఎవరో కాదు విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. ఆయనకు వైసీపీ అన్నా జగన్ అన్నా మంట. రాజకీయ ప్రత్యర్ధిగా వైసీపీ ఉండడమే కారణం అనుకున్నా ఆయన ప్రత్యర్ధి…

బీజేపీ రాజు అంటే ఎవరో కాదు విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. ఆయనకు వైసీపీ అన్నా జగన్ అన్నా మంట. రాజకీయ ప్రత్యర్ధిగా వైసీపీ ఉండడమే కారణం అనుకున్నా ఆయన ప్రత్యర్ధి పార్టీగా కంటే ఎక్కువగానే వైసీపీని టార్గెట్ చేస్తారు అని వైసీపీ నేతలు అంటూంటారు.

లేటెస్ట్ గా రాజు గారు ఒక కొత్త విషయం చెప్పారు. వైసీపీ బీజేపీలో విలీనం కాబోతోంది అన్నదే ఆ విషయం. ఇది ఎక్కడా పుకారుగా కూడా వ్యాప్తి చెందలేదు. ఎవరూ కూడా దీనిని ఎక్కడా ప్రస్తావించినదీ లేదు. బీజేపీ రాజు గారు మాత్రం వైసీపీని బీజేపీలో విలీనం చేస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.

వైసీపీకి వచ్చే ఎన్నికల్లో అయిదు అసెంబ్లీ స్థానాలు కూడా రావని ఆయన సర్వే నివేదికను వినిపించారు. జగన్ లక్ష కోట్ల దోపిడి అంతా బెంగళూరు ప్యాలెస్ లో ఉందని విచారణ సంస్థకు అక్కడికి వెళ్ళి దాడులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే జగన్ విమానంలో ప్రయాణిస్తున్నపుడు కూడా చెక్ చేయాలని కోరారు.

మరి ఇంతలా వైసీపీ మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనక వ్యూహం ఏమిటి అన్నది తెలియడంలేదు. టీడీపీ వైసీపీని టార్గెట్ చేస్తుంది. దాని కంటే ఎక్కువగా బీజేపీ చేయడమే విడ్డూరంగా ఉంది అని అంటున్నారు. బీజేపీలో వైసీపీ విలీనం అన్న మాటే కొత్తగా ఉంది.

ఒకవేళ అది నిజంగా జరుగుతుందని అనుకున్నా కేంద్ర బీజేపీ పెద్దల స్థాయిలో జరిగే నిర్ణయాలు అవి. పార్టీలో తాము వ్యతిరేకిస్తామని రాజు గారు అంటున్నారు. నిప్పు లేనిదే పొగ రాదు అన్న దానిని బట్టి చూస్తే ఇందులో ఎంతో కొంత నిజం ఉందా అన్న చర్చకు తెర లేస్తోంది.

11 Replies to “జగన్ మీద మండిపోతున్న బీజేపీ రాజు గారు”

  1. రొయ్యలాగ అంతపెద్ద మీసాలున్నాయ్, మొగోళ్ళైతే VVPAT లు లెక్కపెట్టమనివేసిన వాటిగురించి చూడమని మీమాట తూచా తప్పకుండా పాటించే ఆ వ్యవస్థ కి చెప్పు చూద్దాం

  2. Leven Mohana గాడు BJP కి భారం తప్ప భలం అవలేడు.. సిద్ధాంత పరంగా ఈడు ఇమడలేడు అక్కడ..

    FINAL గా తల్లి కాంగ్రెస్ లో కలిసి povaalsinde.

  3. ఏదో అటెన్షన్ కోసం అని ఉంటారు, బంగారు బాతు గు*డ్డు లాంటి పార్టీ ని వదిలేస్తారా ఎవరైనా అదీ 40% ఓటు బ్యాంకు ఉన్న పార్టీ ని.

  4. ఈ రాజుగారు చంద్రబాబు భక్తుడు. చంద్రబాబును శోభన్ బాబు అని కీర్తించిన భక్తాగ్రేసరుడు.

    బీజేపీ లోకి కొట్టుకొచ్చిన ఎంగిలివిస్తరాకులలో ఒకడు.

    తెలుగుదేశంతో పొత్తు ఉంటే బీజేపీలో ఉండి సీటు దక్కుంచుకుందాం పొత్తు లేకపోతే బీజేపీ నుంది జంప్ అయి ఇంకో చోట వాలదాము అనుకునే నిష్ణాతుడు.

    ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీజేపీ లో ఉన్నది తెలుగుదేశం కోవర్టులే తప్ప, తెలుగుదేశం టూ కాంగ్రెస్ టూ బీజేపీ లోకి ఫిరాయిచిన అమ్మోరి ఏలుబడిలో ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఎవరున్నారు ?

    తెలంగాణాలో తెలుగుదేశం అనుకూల రేవంత్ రెడ్డి కోసం BRS బీజేపీ లో విలీనం అవుతున్నది అని ప్రచారం మొదలెట్టింది పచ్చమాఫియా. మరి దీనికి కూడా ఏమైనా పెద్దప్లాన్ ఉన్నదేమో

Comments are closed.