వైసీపీలో ద‌క్క‌ని ప‌ద‌వి… టీడీపీలో ద‌క్కింది!

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిని ప‌బ్లిక్ అండ‌ర్ టేకింగ్స్ క‌మిటీలో స‌భ్యుడిగా లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా నియ‌మించారు. 15 మంది లోక్‌స‌భ స‌భ్యులు, ఏడుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల‌తో ఈ క‌మిటీని స్పీక‌ర్ ఏర్పాటు చేశారు.…

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిని ప‌బ్లిక్ అండ‌ర్ టేకింగ్స్ క‌మిటీలో స‌భ్యుడిగా లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా నియ‌మించారు. 15 మంది లోక్‌స‌భ స‌భ్యులు, ఏడుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల‌తో ఈ క‌మిటీని స్పీక‌ర్ ఏర్పాటు చేశారు. ఇందులో ఏపీకి చెందిన వేమిరెడ్డికి చోటు ల‌భించింది.

గ‌తంలో వేమిరెడ్డి వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌ని చేశారు. అప్ప‌ట్లో ఆయ‌న ఇదే క‌మిటీలో స‌భ్య‌త్వాన్ని ఆశించారు. అయితే వైసీపీ నిరాక‌రించింది. దీంతో ఆయ‌న మ‌న‌స్తాపం చెందారు.

ఒక సంద‌ర్భంలో ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన వైసీపీ అధినేత‌, నాటి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దృష్టికి త‌న బాధ‌ను వేమిరెడ్డి తీసుకెళ్లారు. అస‌లు త‌నకెవ‌రూ ఈ విష‌యం చెప్ప‌లేద‌ని, తెలిసి వుంటే ప‌బ్లిక్ అండ‌ర్ టేకింగ్స్ కమిటీలో స‌భ్య‌త్వం ఇప్పించ‌డం పెద్ద విష‌యం కాద‌ని వేమిరెడ్డితో జ‌గ‌న్ అన్న‌ట్టు తెలిసింది.

దీన్ని బ‌ట్టి వైసీపీలో ఏం జ‌రిగిందో అర్థం చేసుకోవ‌చ్చు. వైసీపీ కోసం వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేశారు. వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఆర్థికంగా ఆయ‌న అండ‌గా నిలిచారు. అలాంటి నాయ‌కుడు చిన్న ప‌ద‌వి అడిగితే, క‌నీసం జ‌గ‌న్ దృష్టికి కూడా తీసుకెళ్ల‌కుండానే మ‌ధ్య‌లోనే అడ్డుకున్నార‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

వైసీపీకి వేమిరెడ్డి దూర‌మైన నేప‌థ్యంలో ఈ విష‌యం వెలుగు చూసింది. ఇదే టీడీపీలో ఆయ‌న అడ‌గ‌కుండానే పార్టీ ప‌ద‌వి ఇచ్చింది. వైసీపీలో కోరుకున్న‌ది ద‌క్క‌క‌పోగా, టీడీపీలో అదే ప‌ద‌వి ల‌భించింది.

16 Replies to “వైసీపీలో ద‌క్క‌ని ప‌ద‌వి… టీడీపీలో ద‌క్కింది!”

  1. జగనన్న అంతే.. అన్నీ తెలిసినా.. ఏమీ తెలియనట్టు ఫేస్ పెడతాడు..

    ఏమీ తెలియకపోయినా.. అంతా తనకే తెలిసినట్టు .. కట్టింగులిస్తాడు..

    వేమిరెడ్డి జంప్ అని నేను సెప్టెంబర్ 2023 లోనే చెప్పాను.. నాకు కూడా తెలిసిన విషయం .. మన రాష్ట్ర సీఎం కి తెలియదు అని చెపుతాడు.. మనం విందాం.. అయ్యో పాపం అనుకొందాం..

    పార్టీ లో ఏమి జరుగుతోందో తెలియదు..

    రాష్ట్రం లో ఏమి జరుగుతోందో తెలియదు..

    పరిపాలన ఎలా చేయాలో తెలియదు..

    ఈ మాత్రం బోకుగాడు మాకు దొరకడని .. 151 సీట్లిచ్చి నెత్తిన పెట్టుకొన్నారు.. 5 ఏళ్ళు దూల తీర్చేసాడు.. చరిత్ర మరువని చీకటి రోజులు మిగిల్చాడు..

    చివరికి అదే జనాలు 11 సీట్లిచ్చి.. కుర్చీ మడతెట్టేసిన విషయమైనా జగన్ రెడ్డి కి తెలుసో లేదో.. పాపం..

    1. మీరొక పెద్ద నేత జంప్ అవుతారు అని చెప్పిన విషయం నాకు గుర్తుంది.

  2. టీడీపీలోకి వచ్చి నందుకు మర్యాద, కావాల్సిన పదవి ఇస్తున్నారు

  3. ఓరీ నీ యేసాలో! నీకు చెప్పకుండానే పార్టీ లో అన్ని జరిగిపోయాయి అన్నమాట, ఆఖరికి వినాశం గాడు ప్యాలస్ లో ఉదయాన్నే 3 గంటలకి వొళ్ళు విరుసుకుంటూ ఆవలించే సంగతి కూడా నీకు తెలియదు అని జనాలు నమ్మేసారు , సరేనా.

  4. వేమిరెడ్డి గారి లాంటి వారు పార్టీ లకి అతీతంగా సాత్విక వ్యక్తిత్వం కలిగి వుంటారు.

    అలాటి అతన్ని కూడా ప్యాలస్ పులకేశి గాడు, వొళ్ళు మదం తో కన్నుమిన్ను లేకుండా అవమానం చేసారు. దొం*గ రెడ్డి ప్యాలస్ పులకేశి దెబ్బకి అసలు నిజమైన రె*డ్డి వేమారెడ్డి గారు , పెం*ట మీద రాయి వేయడం యెం*దుకు అని తానే తప్పుకున్నారు.

  5. జీయే(ga) బుల్రెడ్డి – వైచీపీ లో వేమిరెడ్డి కి దక్కనిది పదవి కాదు, గౌరవం.

  6. Sollu cheppaku ra GA..Phone enduku lift cheyyaledu ante Silent lo vundi chusukoledu annatlu vundi nuvvu cheppedi.Jagan ki teliyakunda enduku vuntadi..kaka pothe thappuku migataniki naku teliyadu ani cheppi vuntadu

Comments are closed.