అన్నింటికీ ఫుల్ క్లారిటీ

నమ్మిన వారి కోసం, స్నేహం చేసిన వారి కోసం, మొహమాట పడకుండా, సమస్యలకు జంకకుండా, ధైర్యంగా వెళ్లేవాడే కదా గొప్పవాడు.

నిన్నటికి నిన్న జ‌రిగిన రావు రమేష్- మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఒక్క విషయంలో కాదు. మూడు విషయాల్లో.

బన్నీ ఎన్నికల ముందు వైకాపా అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి వెళ్లడం, సుకుమార్ తో విబేధాలు, పుష్ప 2 విడుదల తేదీ. ఈ మూడింటి మీద ఒకేసారి క్లారిటీ ఇచ్చేసాడు బన్నీ.

తనకు నచ్చితే, తాను ఇష్టపడితే, అండగా నిల్చోవడానికి, ఎక్కడికైనా వెళ్లడానికి తాను వెనుకాడను అని చెప్పేసాడు. నిజ‌మే కదా. మనిషి వ్యక్తిత్వం అక్కడే బయటపడుతుంది. నమ్మిన వారి కోసం, స్నేహం చేసిన వారి కోసం, మొహమాట పడకుండా, సమస్యలకు జంకకుండా, ధైర్యంగా వెళ్లేవాడే కదా గొప్పవాడు.

పుష్ప 2 డిసెంబర్ 6న వస్తోందని కూడా సభాముఖంగా చెప్పేసాడు. సుకుమార్ కు ఇది అంగీకారమా కాదా అన్నది తెలియదు. కానీ సుకుమార్ పక్కన వుండగానే చెప్పేసాడు కనుక, ఇక డేట్ మార్చేది లేదు అని దర్శక నిర్మాతలకు క్లారిటీ ఇచ్చేసాడు చాలా స్పష్టంగా బన్నీ. అందువల్ల ఇక డిసెంబర్ కు ప్లాన్ చేసుకున్న మిగిలిన సినిమాలు అన్నీ వాటి ఏర్పాట్లు అవి చేసుకోవాల్సిందే.

మూడో ముచ్చట ఏమిటంటే సుకుమార్ తో విబేధాలు. ఈవెంట్ లో సుకుమార్ ను హగ్ చేసుకున్నాడు. అది మామూలే. టాలీవుడ్ లో శతృవులు కూడా హగ్ చేసుకుంటారు. పెద్ద విషయం కాదు. కానీ స్టేజ్ మీద సుకుమార్ ఓ మాట అన్నారు.

ఒక్కోసారి ఒక రోజు చేయాల్సిన పని రెండు రోజులు చేసాం. ఒక్కోసారి బన్నీ కోసం మరోసారి తన కోసం.. ఏం చేసినా అభిమానుల కోసమే అని చెప్పేసాడు. అంటే విబేధాలు అనే వార్తలు కేవలం దీని నేపథ్యంలో తప్ప వేరు కాదు అని అర్థమైంది. పైగా సుకుమార్ భార్య తబిత సమర్పించే సినిమా మారుతీ సుబ్రహ్మణ్యం. దాని కోసం బన్నీ వచ్చాడు అంటే సుకుమార్ తో మరీ మొహం మొహం చూసుకోనంత విబేధాలు లేనట్లే.

అన్ని విషయాల్లో క్లారిటీ వచ్చేసింది. ఇక మిగిలింది పుష్ప 2 రావడమే.

26 Replies to “అన్నింటికీ ఫుల్ క్లారిటీ”

  1. pawan kalyan stands for TDP package star and where as Allu arjun supports YCP it is his showcasing his personality what double standards journalism GA. way to go. Huge round of applause.

  2. ఎవ్వరికి కావాలి క్లారిటీ. సినిమా బాగుంటే చూసి టైంపాస్ చేస్తాం గాని.

    1. వారూ వారూ ఎన్నైనా కొట్టుకు చావనీ… మనం పెట్టే ప్రతి పైసా కి entertain చేస్తే చాలు😊

  3. రెండువైపులా కవర్ చేసి తనకి ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా ఉండాలనే వ్యూహంతో నంద్యాల లో వెళ్లి ప్రచారం చేసారు బన్నీ గారు. ఇలా జరుగుతుందని ఊహించి ఉండరు.

  4. సు కుమార్ గారూ… బన్నీ గారు మధ్య విబేధాలు ఏమీ లేవు. అదంతా PR సృష్టి. సినిమా రిలీజ్ లేట్ అవడానికి కారణం కావాలి కదా

  5. YCR's favorite dialog - 
    తల్లికి తిండి పెట్టలేని ఓ వ్యక్తి తన పిన్నమ్మకు బంగారు కంకణాలు కానుకగా ఇచ్చాడు
    Couldnt support his own family member in a critical election, now talks about
    friendship

  6. ఇంక మన Paytm కుక్కల్ని మహేష్ DP తీసేసి బన్నీ DP పెట్టుకోమని చెప్పు GA….. ఫ్యాన్సు పెరుగుతారు….NEXT ELECTIONS కి కూడా పనికొస్తారు ….😂😂

Comments are closed.