నాన్ స్టాప్ గా రాజాసాబ్

మారుతి- ప్రభాస్ కాంబినేషన్ లో తయారవుతున్న పీపుల్స్ మీడియా సినిమా రాజా సాబ్. ఈ సినిమా షూట్ నాన్ స్టాప్ గా జ‌రుగుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన భారీ సెట్ లో ప్రస్తుతం…

మారుతి- ప్రభాస్ కాంబినేషన్ లో తయారవుతున్న పీపుల్స్ మీడియా సినిమా రాజా సాబ్. ఈ సినిమా షూట్ నాన్ స్టాప్ గా జ‌రుగుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన భారీ సెట్ లో ప్రస్తుతం షూట్ జ‌రుగుతోంది. అడవి మధ్యలో వున్న పాడుపడిన ఇంటి సెట్ ను భారీగా వేసారు. ఈ సెట్ లోనే ప్రస్తుతం షూటింగ్ జ‌రుగుతోంది.

ఇప్పటి వరకు రాజాసాబ్ షూట్ అప్పుడో సారి ఇప్పుడోసారి అన్నట్లు జ‌రుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఈ నవంబర్ లోగా రాజాసాబ్ ను పూర్తి చేసేయాలని ప్రభాస్ డిసైడ్ అయిపోయారు.

హర్రర్ ఎంటర్ టైనర్ అంటే జ‌నం ఇంట్రస్ట్ చూపించడం అన్నది ఒక పాయింట్. ఈ సినిమా పూర్తి చేస్తే 2025 ఫస్ట్ హాఫ్ లో విడుదల చేసుకోవచ్చు. రెండో హాఫ్ కు కల్కి 2 లేదా హను రాఘవపూడి సినిమాను రెడీ చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు నాన్ స్టాప్ గా వీలయినన్ని రోజులు రాజాసాబ్ షూట్ జ‌రిపించేయాలని ప్రభాస్ డిసైడ్ అయ్యారు.

ఎవ్విరిథింగ్ రెడీగా వుండడంతో దర్శకుడు మారుతి చకచకా షూట్ కానిచ్చేస్తున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద సైజు మొక్కలు నాటి, పెంచి చిన్న సైజు అడవిలా తయారు చేసారు. దాని మధ్య రకరకాల సెట్ ప్రాపర్టీలు ఏర్పాటు చేసారు. పాడుపడిన విల్లా మోడల్ ఇల్లు నిర్మించారు. చూస్తుంటే ప్రభాస్ ఖాతాలో మరో విభిన్నమైన మాంచి హిట్ పడేలా కనిపిస్తోంది.

4 Replies to “నాన్ స్టాప్ గా రాజాసాబ్”

Comments are closed.