పండగ తేదీల కోసం, లాంగ్ వీకెండ్స్ కోసం కొట్టుకుంటారు టాలీవుడ్ జనాలు. ఎవరైనా పోటీకి వస్తారేమో అనే భయంతో ఆఘమేఘాల మీద కర్చీఫులు వేస్తుంటారు. ఏడాది ముందే రిలీజ్ డేట్స్ ప్రకటించిన మేకర్స్ కూడా ఉన్నారు. తీరా విడుదల తేదీ దగ్గరకొచ్చేసరికి, సరైన సినిమానే ఉండదు. అన్నీ వాయిదాలు పడుతుంటాయి. అదీ మనోళ్ల ప్లానింగ్.
అలా ఈ ఏడాది సమ్మర్ ను ఇప్పటికే కోల్పోయింది టాలీవుడ్. సరైన సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఇప్పుడు దసరా బాక్సాఫీస్ పరిస్థితి కూడా ఇలానే తయారైంది. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల దసరాకు పెద్ద సినిమా లేకుండా పోయింది. దేవర-1 వస్తోంది కానీ, దసరా టైమ్ కి అది రిలీజై 2 వారాలు దాటుతుంది.
చిరంజీవి, బాలయ్య, వెంకటేశ్, ప్రభాస్, మహేష్, చరణ్, బన్నీ.. ఇలా ఒకరిద్దరు కాదు, దాదాపు 15 మంది పెద్ద హీరోలున్నారు మనకి. వీళ్లలో ఒక్కరు కూడా ఈ దసరాకు సినిమాను రెడీ చేయలేకపోయారు.
ఇంతకీ ఈ దసరాకు ఏ సినిమాలొస్తున్నాయో తెలుసా..? విశ్వం, జనక అయితే గనక, శ్వాగ్.. ఇవి మాత్రమే. దసరా శెలవుల్లో చూస్తే ఈ సినిమాలే చూడాలి. లేదంటే, అప్పటికే విడుదలై 2 వారాలు దాటిన దేవర-1 (సెప్టెంబర్ 27 రిలీజ్) సినిమాను మరోసారి చూడాలి. నిజంగా దేవర సినిమా చూడాలనుకునేవాళ్లు దసరా శెలవుల్లో చూద్దాంలేం అని 2 వారాలు ఆగరు కదా.
ఇంతకు ముందు దసరాల సంగతేంటి?
కరోనా ఏడాది మినహాయిస్తే.. దాదాపు ప్రతి దసరాకు పెద్ద సినిమా పడింది. ఉదాహరణకు గతేడాదినే తీసుకుంటే భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలొచ్చాయి. అంతకుముందు ఏడాది ది ఘోస్ట్, గాడ్ ఫాదర్ సినిమాలొచ్చాయి.
2021 దసరా సీజన్ లో మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు రాగా.. 2019లో సైరా సినిమా వచ్చింది. అంతకంటే ముందు అరవింద సమేత వచ్చింది. ఇలా ప్రతి దసరాకు ఓ పెద్ద సినిమా ఉంది. కానీ ఈ ఏడాది మాత్రం దసరాకు 2 వారాల ముందు దేవర వస్తోంది. దసరా టైమ్ కు మరో సినిమా లేదు.
పాన్ ఇండియా అంటే ఇది కూడా..?
పాన్ ఇండియా పేరిట సినిమాలు తీయడం కాదు, ప్లానింగ్ కూడా అదే విధంగా ఉంటే బాగుంటుంది. ఈ విషయంలో తెలుగు సినిమా, బాలీవుడ్ ను ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ల రిలీజ్ డేట్స్ అన్నీ పక్కాగా ఉంటాయి. ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ తేదీ నాటికి ఓటీటీకి ఇవ్వాలనే విషయాలపై 90 శాతం బాలీవుడ్ జనం క్లియర్ గా ఉంటారు. టాలీవుడ్ లో మాత్రం ఆ క్లారిటీ లోపిస్తోంది.
లోపం ఎవరిలో ఉంది?
ఈ విషయంలో ఏ ఒక్కరినో నిందించే పరిస్థితి లేదు. కీలకమైన విభాగాలన్నీ అలా తయారయ్యాయి మన దగ్గర. దర్శకుడు పక్కాగా షెడ్యూల్స్ వేస్తాడు, నిర్మాత కూడా రెడీగా ఉంటాడు. కానీ ఆ టైమ్ కు హీరో అందుబాటులోకి రాడు. సడెన్ గా విదేశాలకు వెళ్లిపోతాడు. ఇంకో సందర్భంలో అంతా రెడీగా ఉంటుంది. దర్శకుడికి మాత్రం మూడ్ ఉండదు.
చాలా సినిమాలకు జరిగేది ఏంటంటే.. సెట్స్ పైకి వెళ్లిన తర్వాత స్టోరీ డిస్కషన్లు పెట్టుకుంటారు. పైగా అదేదో గొప్ప విషయంగా చెప్పుకుంటారు. మరికొన్ని సినిమాలకు మ్యూజిక్ డైరక్టర్ హ్యాండ్ ఇస్తుంటాడు. ఇంకొన్ని సినిమాలకు అనుకున్న బిజినెస్ జరగక నిర్మాత వాయిదా వేస్తుంటాడు. ఇక గ్రాఫిక్స్ తలనొప్పులు సరేసరి.
ఇలా సవాలక్ష కారణాలు, కోటి సమస్యలు. వీటిని దాటినప్పుడే ప్లానింగ్ పక్కాగా ఉంటుంది, పాన్ ఇండియా అనిపించుకుంటుంది.
Call boy jobs available 9989793850
జనం పండగ చేసుకుంటారు ఇంట్లో
ఒకవేళ రిలీజ్ చేసినా థియేటర్లో చూడం
vc available 9380537747
Call boy jobs available 9989793850