నిహారిక Vs సుశ్మిత

మెగా కాంపౌండ్ లో ఈమధ్య కొత్త నిర్మాతలు పుట్టుకొచ్చారు. పైగా ఇద్దరూ మహిళా నిర్మాతలే. వాళ్లే నిహారిక కొణెదల, సుశ్మిత కొణెదల. మరి వీళ్లలో ఎవరికి మెగా హీరోలు ముందుగా ఛాన్స్ ఇవ్వబోతున్నారు. Advertisement…

మెగా కాంపౌండ్ లో ఈమధ్య కొత్త నిర్మాతలు పుట్టుకొచ్చారు. పైగా ఇద్దరూ మహిళా నిర్మాతలే. వాళ్లే నిహారిక కొణెదల, సుశ్మిత కొణెదల. మరి వీళ్లలో ఎవరికి మెగా హీరోలు ముందుగా ఛాన్స్ ఇవ్వబోతున్నారు.

పింక్ ఎలిఫెంట్ బ్యానర్ స్థాపించింది నిహారిక. ముందుగా వెబ్ సిరీస్ లతో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టింది. తాజాగా కమిటీ కుర్రోళ్లు సినిమాతో ప్రొడ్యూసర్ గా సక్సెస్ అందుకుంది.

ఇప్పుడీమె సినిమా తీస్తానంటే మెగా హీరోలు ఎవరైనా కాల్షీట్లు ఇస్తారా? చిరంజీవి, పవన్, చరణ్, బన్నీ, వరుణ్, సాయి దుర్గతేజ్, వైష్ణవ్, శిరీశ్.. ఇలా చాలామంది హీరోలున్నారు కాంపౌండ్ లో. బన్నీని మినహాయిస్తే, వీళ్లలో ఎవరితోనైనా నిహారిక సినిమా తీయొచ్చు.

కానీ ఆమె మాత్రం పవన్ కల్యాణ్ తన టార్గెట్ అంటోంది. మంచి కథ దొరికి, ఆ కథ పవన్ కల్యాణ్ ను డిమాండ్ చేస్తే కచ్చితంగా బాబాయ్ తో సినిమా ప్రొడ్యూస్ చేస్తానంటోంది. ప్రస్తుతానికి ఈమె చూపు మాత్రం చిన్న సినిమాలపైనే. నిర్మాతగా తను నేర్చుకోవాల్సింది, సాధించాల్సింది చాలా ఉందంటోంది.

మరి సుశ్మిత పరిస్థితేంటి..? ఈమెది గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్. ఈమె కూడా వెబ్ కంటెంట్ తోనే నిర్మాతగా కెరీర్ ప్రారంభించారు. నిహారికతో పోలిస్తే ఒక అడుగు ముందున్నారు. అదెలా ఉంటే, తండ్రి చిరంజీవితో సినిమా ప్లాన్ చేశారు.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. అలా నిహారికతో పోలిస్తే, సుశ్మిత ఓ ప్రయత్నం చేశారు. అయితే వీళ్లిద్దరూ ఇప్పటివరకు మెగా కాంపౌండ్ లో స్టార్ హీరోలతో సినిమా చేయలేదు. రాబోయే రోజుల్లో వీళ్లలో ముందుగా ఆ ఘనత సాధించేది ఎవరో చూడాలి. ఈ సంగతి పక్కనపెడితే.. సుశ్మితకు రామ్ చరణ్, నిహారికకు వరుణ్ తేజ్ అవకాశం ఇస్తారా అనేది మరో పెద్ద ప్రశ్న.

11 Replies to “నిహారిక Vs సుశ్మిత”

  1. నిర్మాతల పని డబ్బు పెట్టడమే… దానికి అవకాశాలు ఇస్తారు… ఏ హీరో ఇస్తారో అని సొల్లు ఎందుకు.. అదేమైనా క్రియేటివ్ జాబా అమ్మో తేడా వస్తాదేమో అనుకోవడానికి

Comments are closed.