టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేశ్, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ తదితరులకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి వివాదాస్పద కామెంట్ చేయడం, అనంతరం వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలపై దాడికి తెగబడ్డాయి.
మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు నందిగం సురేష్, దేవినేని అవినాష్, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి తదితరులపై కూటమి సర్కార్ నిందితులుగా పేర్కొంది. వీరిలో నందిగం సురేష్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసి, గుంటూరు జైల్లో పెట్టారు. మిగిలిన వాళ్లంతా ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది.
దీంతో వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ నేతల తరపున కపిల్ సిబల్, నీరజ్ కిషన్, అల్లంకి రమేశ్ వాదనలు వినిపించారు. ముందస్తు అరెస్ట్ చేయకూడదనే వైసీపీ తరపు వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. దీంతో వారికి బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు అరెస్ట్ బాధ తప్పడంతో అజ్ఞాతాన్ని వీడనున్నారు. వైసీపీ నేతలకు కోర్టులో భారీ ఊరట దక్కడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఎలాగైనా వైసీపీ నేతల్ని జైల్లో పెట్టాలన్న కూటమి సర్కార్ ప్రయత్నాలు నెరవేరలేదు.
అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది
Evm batch ki dada
E@V@M batch ki dada modalu
In English you said it is Partial relief for Jogi, Devineni in SC
How come different versions in the same site?
telugu valu ante alasu
vc estanu 9380537747
ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. పాస్‌పోర్ట్ 48 గం ల్లో ఐ ఓ ముందు సరెండర్ చేయాలి. విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. విచారణకు సహకరించాలి. విచారణకు సహకరించకుంటే రక్షణ ఉండదు.