బాబు ప‌లుకుబ‌డికి అగ్ని ప‌రీక్ష‌!

ఏపీలో కూడా ఎన్డీఏ స‌ర్కార్ వుండ‌డం వ‌ల్ల వ‌ర‌ద బాధితులు న‌ష్ట‌ప‌రిహారంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి ప‌లుకుబ‌డికి అగ్ని ప‌రీక్ష‌. కృష్ణా, గుంటూరు, ఉభ‌య‌గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో తుపాను కార‌ణంగా వ‌ర‌ద ముంచెత్తింది. విజ‌య‌వాడ అత‌లాకుత‌ల‌మైంది. అలాగే కొన్ని జిల్లాల్లో పంట‌లకు భారీ న‌ష్టం సంభ‌వించింది. ఏపీ స‌ర్కార్ ప్రాథ‌మిక న‌ష్టం అంచ‌నా దాదాపు రూ.7 వేల కోట్లు. ఈ నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు కేంద్ర బృందం ఏపీలో ప‌ర్య‌టించింది.

కేంద్ర బృందంతో చంద్ర‌బాబు మాట్లాడుతూ జాతీయ విప‌త్తుగా చూడాల‌ని కోరారు. కేంద్రం పెద్ద మ‌న‌సుతో సాయం అందించాల‌ని కోరారు. ప్ర‌జ‌ల ఆస్తుల‌కు తీవ్రంగా నష్టం జ‌రిగింద‌ని, నీళ్ల‌లో పంట‌లు మునిగి రైతుల‌కు భారీ న‌ష్టం సంభ‌వించింద‌ని కేంద్రం బృందంతో చంద్ర‌బాబు అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఉదార‌త చూపేలా నివేదిక‌లు ఇవ్వాల‌ని ఆయ‌న కోర‌డం విశేషం.

చంద్ర‌బాబుకు ఇక్క‌డే అతి పెద్ద ప‌రీక్ష‌గా చెప్పొచ్చు. ఏపీలో భారీ న‌ష్టం సంభ‌వించిన నేప‌థ్యంలో కేంద్రం నుంచి భారీ మొత్తంలో నిధులు రాబ‌ట్టాల్సిన బాధ్య‌త బాబుపై వుంది. మ‌రీ ముఖ్యంగా కేంద్రంలో మోడీ స‌ర్కార్ ఏర్పాటుకు, అలాగే ఏ స‌మ‌స్యా లేకుండా ప్ర‌భుత్వం కొన‌సాగుతున్న‌దంటే చంద్ర‌బాబే కార‌ణం. ఒక మాట‌లో చెప్పాలంటే కేంద్రంలో బాబు కూడా కీల‌క భాగ‌స్వామి. త‌న రాష్ట్రానికి తానే నిధులు కేటాయించుకునే ప‌రిస్థితిలో చంద్ర‌బాబు ఉన్నారు.

ఏపీలో కూడా ఎన్డీఏ స‌ర్కార్ వుండ‌డం వ‌ల్ల వ‌ర‌ద బాధితులు న‌ష్ట‌ప‌రిహారంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. త‌మ‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ ఆదుకుంటుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు. ఒక‌వేళ ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేక‌పోతే మాత్రం, చంద్ర‌బాబు ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోవ‌డం ఖాయం. ఆ ప‌రిస్థితి బాబు తెచ్చుకోర‌నే వాద‌న వుంది. ఏమ‌వుతుందో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.

9 Replies to “బాబు ప‌లుకుబ‌డికి అగ్ని ప‌రీక్ష‌!”

  1. For giving 25K and 10K per house, why do they need funds from central government. The donations given by public will be more than enough but leaders will need more funds to loot which is why the ask for additional funding. Floods and rains will now become ATM for some kootami leaders.

  2. నిధులు తీసుకురాక పోతే, ప్రజలు సీబీఎన్ మీద విశ్వాసం కోలుపోతారా? అవునా? ఆ విశ్వసం జగన్ వైపుకు మల్లి సీఎం కుర్చీ లో కూర్చోపెడతారా ఈ రోజే? ఏం రాస్తున్నావయ్యా? 11 సొంతదారుడి ట్రైనింగ్ బాగానే ఉన్నట్టు ఉంది.

  3. అదెంటొ అదికారం లొ ఉన్నా ప్రతిపక్షం లొ ఉన్నా, అన్ని అగ్ని పరిక్షలూ బాబు కె ఉన్నట్టు రాసాడు ఈ బులుగు మీడియాలొ.

    1. అఖరుకి..జగన్ శిక్ష పడి జై.-.ల్ కి వెల్తున్నాడు అన్నా …

      జైల్ లొ అన్ని సౌకర్యాలు బాబు కల్పిస్తారొ లెదొ, ఇది బాబుకి అగ్ని పరిక్ష అంటాడు GA.

  4. పలుకు ఉంటే అప్పుడు చూడవచ్చు. మోడీ ని చూస్తే త..త.. మా.. మా. ఆ రేంజ్ భయం పెట్టాడు మోడీ.

Comments are closed.