సైమా సాక్షిగా ‘సయోధ్య’?

ఓ పెద్ద సోషల్ మీడియా వార్ కు తెరపడినట్టు కనిపిస్తోంది. నాని, విజయ్ దేవరకొండ కలిశారు. ఒకే వేదిక షేర్ చేసుకున్నారు. సరదాగా మాట్లాడుకున్నారు. Advertisement ఈ మాత్రం దానికే యుద్ధాలు ఆగిపోతాయా? నిజమే…

ఓ పెద్ద సోషల్ మీడియా వార్ కు తెరపడినట్టు కనిపిస్తోంది. నాని, విజయ్ దేవరకొండ కలిశారు. ఒకే వేదిక షేర్ చేసుకున్నారు. సరదాగా మాట్లాడుకున్నారు.

ఈ మాత్రం దానికే యుద్ధాలు ఆగిపోతాయా? నిజమే ఆగవు, కాకపోతే ఇంతకంటే ఇంకాస్త ఎక్కువే జరిగింది. నానిని విజయ్ దేవరకొండ అన్నా అని పిలిచాడు. ఫ్యాన్స్, తమ అభిమాన నటుడ్ని అన్నా అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు అర్థమైందంటూ పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు.

అక్కడితో అయిపోలేదు. ‘ఎవడే సుబ్రమణ్యం’ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఎంతో ఎమోషనల్ అయ్యారు, పరస్పరం కౌగిలించుకున్నారు. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్.. సోషల్ మీడియా వార్ ఆపడానికి ఈమాత్రం సరిపోతుందంటున్నారు జనం.

టయర్-2లో ఎవరు నంబర్ వన్ అనే చర్చ మినిమం గ్యాప్స్ లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. విజయ్ దేవరకొండ సినిమా రిలీజైనప్పుడు నాని ఫ్యాన్స్ ట్రోల్ చేయడం.. నాని సినిమా వచ్చినప్పుడు రౌడీ ఫ్యాన్స్ రచ్చ చేయడం పరిపాటిగా మారింది.

రీసెంట్ గా ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్ లో ఈ రచ్చకు కొంతమేర ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు నాని. “టయర్-1, టయర్-2 అంటూ పోలుస్తున్నారు. నాకు అలాంటివేం వద్దు. నన్ను ఇలా ఉండనివ్వండి. నా మనసుకు నచ్చిన టీమ్స్ తో పనిచేస్తున్నాను. మనసుకు నచ్చిన కథలు, దానికి తగ్గ బడ్జెట్స్ దొరుకుతున్నాయి. నా సినిమాలు చూసే ప్రేక్షకులున్నారు. నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించని బెస్ట్ ప్లేస్ లో ప్రస్తుతం ఉన్నాను. నేను ఇక్కడే ఇలానే ఉంటే చాలు. ఇంకో స్థానం నాకు అక్కర్లేదు.”

ఇలా తనవంతుగా వివాదాలు తగ్గించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నాని స్పందించిన రోజుల వ్యవథిలోనే విజయ్ కూడా నానిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రేమతో అన్నా అని పిలిచాడు.

ఈ ఇద్దరి మధ్య ఇంత జరిగింది కాబట్టి ఫ్యాన్స్ శాంతిస్తారనే అనుకోవాలి. వాళ్లు నిజంగా కూల్ అయ్యారా లేదా అనే విషయం తెలియాలంటే.. నాని లేదా విజయ్ దేవరకొండలో ఎవరో ఒకరి సినిమా విడుదలవ్వాలి.

5 Replies to “సైమా సాక్షిగా ‘సయోధ్య’?”

Comments are closed.