ప్లీజ్.. మాకు సమంత కావాలి

ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. వాళ్లు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారంటే, చెప్పిన టైమ్ కు అప్ డేట్ ఇవ్వకపోతే అదే స్థాయిలో…

ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. వాళ్లు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారంటే, చెప్పిన టైమ్ కు అప్ డేట్ ఇవ్వకపోతే అదే స్థాయిలో రివర్స్ అవుతారు కూడా. ఒక దశలో తమ హీరోపై కూడా ట్రోలింగ్ చేసిన సందర్భాలున్నాయి.

ఇప్పుడీ అభిమానులంతా మరోసారి యాక్టివ్ అయ్యారు. ఈసారి ప్రభాస్ కు ప్రత్యేక విన్నపం చేస్తున్నారు. అదేంటంటే.. అప్ కమింగ్ మూవీలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలంట.

హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు ప్రభాస్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. మూవీ ఓపెనింగ్ కూడా అట్టహాసంగా జరిగింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుంది. ఒక హీరోయిన్ గా ఇమాన్విని ఆల్రెడీ తీసుకున్నారు.

మరో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలనే చర్చ మొదలైంది. ఇప్పటివరకు ప్రభాస్-సమంత తెరపై కనిపించలేదు కాబట్టి, ఈ కాంబినేషన్ కొత్తగా, ఫ్రెష్ గా ఉంటుందంటున్నారు అతడి అభిమానులు. సమంత కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో సరసన నటించి చాన్నాళ్లయింది.

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మరో హీరోయిన్ ఎంపిక కూడా పూర్తయింది. త్వరలోనే ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ అనుకుంటున్నారు.

5 Replies to “ప్లీజ్.. మాకు సమంత కావాలి”

Comments are closed.