ఆ పార్టీ కార్యాల‌యాన్ని కూల్చేయండి!

న‌ల్గొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని కూల్చేసేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మున్సిప‌ల్ శాఖ అనుమ‌తులు తీసుకోకుండా బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని నిర్మించార‌ని.. ఎలాంటి అనుమ‌తుల్లేకుండా నిర్మించ‌డంతో కూల్చేయాల‌ని గ‌తంలో మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి…

న‌ల్గొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని కూల్చేసేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మున్సిప‌ల్ శాఖ అనుమ‌తులు తీసుకోకుండా బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని నిర్మించార‌ని.. ఎలాంటి అనుమ‌తుల్లేకుండా నిర్మించ‌డంతో కూల్చేయాల‌ని గ‌తంలో మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల్ని స‌వాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత‌లు తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు.

త‌మ కార్యాల‌యాన్ని రెగ్యుల‌రైజ్ చేసేలా మున్సిప‌ల్‌శాఖ‌కు ఆదేశాలు ఇవ్వాల‌ని బీఆర్ఎస్ త‌న పిటిష‌న్‌లో పేర్కొంది. ఇవాళ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా న్యాయ‌స్థానం కీల‌క కామెంట్స్ చేసింది. కార్యాల‌యం క‌ట్ట‌డానికి ముందే అనుమ‌తులు తీసుకోవాలి క‌దా? అని హైకోర్టు ప్ర‌శ్నించింది. క‌ట్టిన తర్వాత అనుమ‌తులు కోర‌డం ఏంట‌ని నిల‌దీసింది. బీఆర్ఎస్ కార్యాల‌య నిర్మాణం ముమ్మాటికీ చ‌ట్టం ఉల్లంఘించ‌డ‌మే అని కోర్టు పేర్కొంది.

15 రోజుల్లో బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని కూల్చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ నేత‌లు షాక్‌కు గుర‌య్యారు. సుప్రీంకోర్టుకు వెళ్తారా? లేక ఇంత‌టితో ఊరుకుంటారా? అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

9 Replies to “ఆ పార్టీ కార్యాల‌యాన్ని కూల్చేయండి!”

  1. నల్గొండ పాత RTC బస్సు స్టాండ్ కబ్జా కి గురయ్యింది. అది 100 కోట్లు పై మాటే.

  2. నల్గొండ పాత RTC బస్సు స్టాండ్ క/ బ్జా కి గురయ్యింది. అది 100 కోట్లు పై మాటే.

  3. నల్గొండ పాత RTC బస్సు స్టాండ్ క/ బ్జా కి గురయ్యింది. అది 100 కో/ ట్లు పై మాటే.

  4. నల్గొండ పా/త RTC బస్సు స్టాండ్ క/ బ్జా కి గురయ్యి0ది. అది 100 కో/ ట్లు పై మాటే.

Comments are closed.