ఒక్క పెద్ద సినిమా కూడా లేదు

మొన్నటి సమ్మర్ సీజన్ ఎలా వృధా అయిందో అందరం చూశాం. ఒక్క పెద్ద సినిమా కూడా లేకుండానే ఆ సీజన్ ముగిసింది. ఇప్పుడు కీలకమైన అక్టోబర్ బాక్సాఫీస్ కూడా అలానే తయారైంది. దేవర ఆల్రెడీ…

మొన్నటి సమ్మర్ సీజన్ ఎలా వృధా అయిందో అందరం చూశాం. ఒక్క పెద్ద సినిమా కూడా లేకుండానే ఆ సీజన్ ముగిసింది. ఇప్పుడు కీలకమైన అక్టోబర్ బాక్సాఫీస్ కూడా అలానే తయారైంది. దేవర ఆల్రెడీ వచ్చేసింది, దసరాకు ఒక్క సినిమా లేదు. ఇండస్ట్రీ పెద్దల లెక్కప్రకారం చూసుకున్నా, మరో పెద్ద సినిమా రావొచ్చు.

అక్టోబర్ మొదటి వారంలో అరడజను సినిమాలొస్తున్నాయి. శ్వాగ్, కలి, మిస్టర్ సెలబ్రిటీ, యమకంత్రీ.. ఇలా అన్నీ చిన్న సినిమాలే. వీటిలో కాస్త అంచనాలతో వస్తున్న సినిమా శ్వాగ్. శ్రీవిష్ణు, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై జనాల దృష్టి పడింది. దీనికి ఓ కారణం ట్రయిలర్ క్లిక్ అవ్వడం, మరో కారణం రాజరాజచోర కాంబినేషన్ రిపీట్ అవ్వడం.

రెండో వారంలో.. రజనీకాంత్ వెట్టయాన్, గోపీచంద్ విశ్వం, సుహాస్ చేసిన జనక అయితే గనక సినిమాలొస్తున్నాయి. దసరాకు వస్తున్న సినిమాలివే. వీటిలో వెట్టయాన్, విశ్వంపై అంచనాలున్నాయని చెప్పలేం, అలా అని లేవని కూడా చెప్పలేం. ఎందుకంటే, రజనీకాంత్ గత చిత్రం డిజాస్టర్ కాగా, గోపీచంద్ వరుసపెట్టి ఫ్లాపులిస్తూనే ఉన్నాడు.

మూడో వారానికి ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సినిమాలేం షెడ్యూల్ కాలేదు. చివరి వారం మాత్రం దీపావళి కానుకగా విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్, శివకార్తికేయన్ అమరన్, సత్యదేవ్ జీబ్రా సినిమాలున్నాయి.

ఇలా అక్టోబర్ నెలలో ఎన్ని సినిమాలొస్తున్నా.. పెద్ద హీరో సినిమా ఒక్కటి కూడా లేదు. వీటిలో ఎన్ని క్లిక్ అవుతాయో చూడాలి.

6 Replies to “ఒక్క పెద్ద సినిమా కూడా లేదు”

  1. Rajnikanth Last solo film Jailer is blockbuster in telugu. His film after Jailer, called Lal salaam is just a guest appearance by Rajni, he is not the hero of Lal salaam

Comments are closed.