ఏపీ స‌ర్కార్ భ‌రోసా కోసం రైతాంగం ఎదురు చూపు!

పీఎం కిసాన్ రెండో విడ‌త నిధుల్ని ఈ నెల 5న రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు. అయితే ఏపీ స‌ర్కార్ భ‌రోసా సొమ్ము కోసం రైతాంగం ఎదురు చూస్తోంది. Advertisement రైతుల‌కు ఏడాదికి రూ.20…

పీఎం కిసాన్ రెండో విడ‌త నిధుల్ని ఈ నెల 5న రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు. అయితే ఏపీ స‌ర్కార్ భ‌రోసా సొమ్ము కోసం రైతాంగం ఎదురు చూస్తోంది.

రైతుల‌కు ఏడాదికి రూ.20 వేలు చొప్పున భ‌రోసా సొమ్ము ఇస్తామ‌ని చంద్ర‌బాబునాయుడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. అయితే వైఎస్ జ‌గ‌న్ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగా లేద‌ని, తాను అధికారంలోకి మ‌ళ్లీ వ‌స్తే రూ.16 వేలు ఇస్తాన‌ని హామీ ఇచ్చారు.

జ‌గ‌న్ కంటే తానే ఎక్కువ ఇస్తాన‌ని చంద్ర‌బాబు చెప్ప‌డంతో మెజార్టీ రైతాంగం కూట‌మి వైపు మొగ్గు చూపింది. ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందిన చంద్ర‌బాబు… అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత హామీల విష‌యాన్ని మ‌రిచిపోయిన‌ట్టున్నారు.

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రెండోసారి కేంద్ర ప్ర‌భుత్వం పీఎం కిసాన్ ప‌థ‌కం కింద రైతుల‌కు సాయం ఇవ్వ‌డానికి రెడీ అయ్యింది. కానీ చంద్ర‌బాబు స‌ర్కార్ మాత్రం ఆ ఊసే ఎత్త‌డం లేదు.

దీంతో రైతాంగం చంద్ర‌బాబు స‌ర్కార్‌పై కోపంగా వుంది. మ‌రోవైపు ఎన్నిక‌ల హామీల‌న్నీ అమ‌లు చేస్తామ‌ని మాట‌ల‌తో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌రిపెడుతున్నారు. ఒక్క రైతు భ‌రోసా మాత్ర‌మే కాదు, సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలేవీ అమ‌లుకు నోచుకోవ‌డం లేద‌ని వైఎస్ జ‌గ‌న్ ప‌దేప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

రాజ‌కీయంగా జ‌గ‌న్‌ను అణ‌గ‌దొక్కి, వచ్చే ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందేందుకు చంద్ర‌బాబు ఏవేవో ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు. కానీ అవేవీ వ‌ర్కౌట్ అవుతున్న‌ట్టుగా లేదు. భ‌విష్య‌త్‌లో ఏం చేస్తారో చూడాలి.

5 Replies to “ఏపీ స‌ర్కార్ భ‌రోసా కోసం రైతాంగం ఎదురు చూపు!”

Comments are closed.