సుప్రీం తీర్పును స్వాగ‌తించిన చంద్ర‌బాబు

ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ ఆరోప‌ణ‌ల‌పై విచారించేందుకు ఐదుగురితో కూడిన క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించ‌డంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు స్వాగ‌తించారు. ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని చంద్ర‌బాబునాయుడు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు…

ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ ఆరోప‌ణ‌ల‌పై విచారించేందుకు ఐదుగురితో కూడిన క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించ‌డంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు స్వాగ‌తించారు. ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని చంద్ర‌బాబునాయుడు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు తాను చేసిన ఆరోప‌ణ‌ల్లో నిజానిజాల్ని నిగ్గు తేల్చాలంటూ చంద్ర‌బాబు సిట్ వేశారు. అయితే సిట్‌ను స‌వాల్ చేస్తూ ప‌లువురు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

సుప్రీంకోర్టు విచారించి… ఇవాళ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్ట‌ర్‌ నేతృత్వంలో స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని స‌ర్వోన్న‌త న్యాయ స్థానం ఆదేశించింది. ఏపీ నుంచి ఇద్ద‌రు అధికారులు మాత్ర‌మే వుంటారు. సుప్రీంకోర్టు వేసిన ద‌ర్యాప్తు క‌మిటీని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్వాగ‌తించ‌డం విశేషం. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

“తిరుప‌తి ల‌డ్డూ వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తున‌కు సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారుల‌తో అధికారుల‌తో కూడిన సిట్ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స్వాగ‌తిస్తున్నా. స‌త్య‌మేవ‌జ‌య‌తే. ఓం న‌మో వెంక‌టేశాయ” అని బాబు ట్వీట్ చేయ‌డం విశేషం. తాను వేసిన సిట్‌ను కాద‌ని, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ నేతృత్వంలో విచార‌ణ చేప‌ట్టాల‌ని సుప్రీం ఆదేశాల‌పై మ‌న‌సులో ఎలా ఉన్నా, బ‌హిరంగంగా చంద్ర‌బాబు స్వాగ‌తించ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌యం.

6 Replies to “సుప్రీం తీర్పును స్వాగ‌తించిన చంద్ర‌బాబు”

  1. కానీ మన పిచ్చోడు మటుకు సిట్టు లేదు బిట్టు లేదు అంటున్నాడు? మరి సుప్రీం కోర్టు ఎవరికి అనుకూలముగా చెప్పింది?

Comments are closed.