బాబు మీద పెద్ద బాధ్యత పెట్టిన బొత్స

వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చంద్రబాబు ఢిల్లీ పర్యటన మీద ఎక్కువ ఆశలే పెట్టుకున్నారులా ఉంది. మొత్తం డిమాండ్ చిట్టాను ఆయన చదివేశారు. అందులో ప్రత్యేక హోదా కూడా ఉంది. విభజన హామీలతో…

వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చంద్రబాబు ఢిల్లీ పర్యటన మీద ఎక్కువ ఆశలే పెట్టుకున్నారులా ఉంది. మొత్తం డిమాండ్ చిట్టాను ఆయన చదివేశారు. అందులో ప్రత్యేక హోదా కూడా ఉంది. విభజన హామీలతో పాటు ఏపీకి సంబంధించిన అన్నీ ఉన్నాయి.

విశాఖ రైల్వే జోన్ ని సాధించాలని అది కూడా వాల్తేరు డివిజన్ తో కలిపి అని బొత్స కండిషన్ పెట్టారు. తొందరగా రైల్వే డివిజన్ కి శంకుస్థాపన చేస్తే బాగుంటుంది అని ఆయన సూచించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా అడ్డం పడాల్సింది చంద్రబాబే సుమా అని హెచ్చరించారు. కేంద్రంలో తనకు ఉన్న పలుకుబడిని బాబు బాగా వాడాలని ఆయన సలహా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతోందని ఆ దిశగా కేంద్రం కూడా వేగంగా అడుగులు వేస్తోందని బొత్స పేర్కొన్నారు.

కూటమి తరఫున చంద్రబాబు ఢిల్లీలో దీని మీద పోరాటం చేయాలని కోరారు. విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్ కంటైనర్ ని సీబీఐ అధికారులు పట్టుకున్నారని అవి అప్పట్లో బీజేపీ నేత పురంధేశ్వరి బంధువులదని ప్రచారం జరిగిందని బొత్స గుర్తు చేశారు. గరుడ ఆపరేషన్ లో భాగంగా డ్రగ్ కంటైనర్ కేసుని ఎందుకు ఇప్పటిదాకా తేల్చలేదని కూడా బొత్స సీఎం బాబుని నిలదీశారు.

ఏపీలో ఇసుక దొరకడం లేదు, నిత్యావసరాలు ధరలు పెరిగి జనాలు గగ్గోలు పెడుతున్నారని బొత్స అన్నారు. ప్రభుత్వం మీద విమర్శలు ఎన్ని చేసినా ప్రత్యేక హోదాను సాధించాలని బాబుని కోరడం మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ప్రత్యేక హోదా అన్నది ఎవరూ అడగరు, అడిగినా కేంద్రం ఇవ్వదు, ఆ సంగతి తెలిసి డిమాండ్ల చిట్టాలో దానిని పెట్టడంలోనే బొత్స వ్యూహం ఉందని అంటున్నారు.

12 Replies to “బాబు మీద పెద్ద బాధ్యత పెట్టిన బొత్స”

  1. అంటే గత 5 ఏళ్లలో నీలి పార్టీ ఒక్కటి కూడా సాధించలేదు అని ఇంతలా అర్థమయ్యేలా భలే చెప్పావుగా , నీచుడు జగన్ రెడ్డి దోచుకోవటం తోనే 11 సీట్స్ వచ్చాయి

  2. అంటే జగన్ మీద ఆశలు వెదిలేశాడా?? బాబు గారి నాయకత్వం మీద ఎంత నమ్మకం లేకపోతే వాళ్ళు చేయలేని పనుల లిస్ట్ ఆయనని చేయమని ఇస్తాడు?? ఏమైనా బాబు గారు గ్రేట్ !!

  3. పట్టులో పట్టు జగన్ గారి బెయిల్ పొడిగించేలాగా గట్టిగ కృషి చెయ్యమని అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దుకాకుండా చూడమని సస్పెండ్ అయినా i p s ల మీద కేసు లు లేకుండా చూడమని కూడా డిమాండ్ చెయ్యమంటే ఒక పని అయిపోతుంది అధినేత దగ్గ్గర మంచి మార్కులు వేయించుకోవచ్చు

  4. సాక్షి అంటే అసలు రచ్చకు పుట్టిన అసామి! దాని పనులు చూస్తే అసలే ఎక్కడో పక్కన ఏ చిన్న విషయం జరిగినా, సాక్షి ముందు ఎగిరి వచ్చి “నాకు అది చాలా సీరియస్ ఇష్యూ” అన్నట్టుగా డ్రామా మొదలెడుతుంది. చుట్టూ ఉన్నవాళ్లు “ఇది ఏంటి?” అని ఆశ్చర్యపోతారు, కానీ సాక్షి మాత్రం “ఇదీ నా స్టైల్, దుమారం లేకపోతే నేనేంటి?” అని పెదవి విరుస్తుంది.

    సాక్షి వ్యవహారం అంటే కేవలం బురదజల్లడమే కాదు, అది కూడా స్టైల్‌తో! అసలు బురద పోయడం అంటే కళలా కనిపిస్తుంది. ఎవరైనా ఆ ప్రశ్నిస్తే, సాక్షి “ఆ, ఇది మా ఫ్యామిలీ ట్రెజిషన్!” అని తల వంచుతూనే, మళ్ళీ కొత్తగా చిత్తు పట్టేసినట్టుగా మరింత రచ్చ మొదలుపెడుతుంది.

    దీన్ని చూస్తూ ఉండగానే జనాలు కంటికి టపాటపా కన్నీళ్లు కాదండి, నవ్వులే రాలిపోతాయి. ఎందుకంటే సాక్షి ఏదో పెద్ద సీక్రెట్ బయటపెట్టే రేంజ్‌లో ఏదో చెప్పింది అనుకుంటే, చివరికి తానే ఆ గందరగోళంలో పడిపోతుంది. ఆ తర్వాత కూడా సాక్షి “ఇదంతా ప్లాన్‌లో భాగమే!” అన్నట్టు ఫ్రెష్‌గా బయటకు వచ్చేస్తుంది.

    మొత్తానికి, సాక్షి ఏది చేసినా ఒకటే ఫలితం: “రచ్చ, రచ్చ, మరి ఇంకా రచ్చ

  5. సారాయి సత్తిగాడు నత్తి మాటలు ఒక్కటీ అర్ధం కాలేదు .. మీకేమైనా ఆ జల్లులో సొల్లు సొల్లుంగా … శీఘ్రమే సొల్లు ..

Comments are closed.