బ్రేకింగ్ – 13న‌ నారా రోహిత్ ఎంగేజ్‌ మెంట్!

హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడు అవుతున్నారు. ఈ నెల 13న ఎంగేజ్‌ మెంట్ కార్యక్రమం వుంది. ఏపీ సీఎం సోదరుడి కుమారుడు నారా రోహిత్. చిరకాలంగా సినిమా రంగంలో వున్నారు. వయసు మీద…

హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడు అవుతున్నారు. ఈ నెల 13న ఎంగేజ్‌ మెంట్ కార్యక్రమం వుంది. ఏపీ సీఎం సోదరుడి కుమారుడు నారా రోహిత్. చిరకాలంగా సినిమా రంగంలో వున్నారు. వయసు మీద పడుతున్నా, కుటుంబ పరిస్థితుల రీత్యా వివాహానికి దూరంగా వున్నారు.

నారా రోహిత్ కు పెద్ద సోదరుడు కూడా వున్నారు.. నారా శిరీష్, అతనికి కూడా ఇంకా వివాహం కాలేదు. ఇలాంటి నేపథ్యంలో నారా రోహిత్ ఓ ఇంటివాడు అవుతున్నాడన్న వార్త తెలిసింది. ఈ నెల 13న హైదరాబాద్ లో ఎంగేజ్‌ మెంట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు, నందమూరి బాలకృష్ణతో సహా కుటుంబ సభ్యులు అంతా హాజ‌రవుతారని తెలుస్తోంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరినే ఈ వివాహ సంబంధం కుదిర్చారని బోగట్టా. కానీ వధువు వివారాలు మాత్రం ఇంకా తెలియలేదు.

కాగా, ప్రతినిధి 2 లో రోహిత్ తో నటించిన అమ్మాయే పెళ్లి కూతురు అని విశ్వసనీయంగా తెలిసింది.

3 Replies to “బ్రేకింగ్ – 13న‌ నారా రోహిత్ ఎంగేజ్‌ మెంట్!”

Comments are closed.