కూట‌మి నేత‌ల తీరుపై ఐఏఎస్ అధికారుల అస‌హ‌నం!

ఎప్పుడూ ఇలాంటి రాజ‌కీయాన్ని, గూండాయిజాన్ని చూడ‌లేద‌ని ఐఏఎస్ అధికారులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

కూటమి నేత‌ల తీరుపై ఐఏఎస్ అధికారులు తీవ్ర అస‌హ‌నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా త‌మ కిందిస్థాయి ఉద్యోగుల‌పై కూట‌మి నేత‌లు దారుణంగా నోరు పారేసుకుంటున్నార‌ని.. విప‌క్ష నేత‌లెవ‌రైనా క‌లెక్ట‌ర్ల ద‌గ్గ‌రికి వెళితే, త‌మ గోడు వెల్ల‌బోసుకుంటున్నార‌ని స‌మాచారం. ఇసుక‌, ఎర్ర‌మ‌ట్టి, అలాగే ఇత‌రత్రా విష‌యాల్లో తాము చెప్పిందే చేయాల‌ని త‌హ‌శీల్దార్ల‌తో పాటు రెవెన్యూ సిబ్బందిపై కూట‌మి నేత‌లు హుకుం జారీ చేస్తున్న‌ట్టు క‌లెక్ట‌ర్లు చెబుతున్నారంటా.

ఎప్పుడూ ఇలాంటి రాజ‌కీయాన్ని, గూండాయిజాన్ని చూడ‌లేద‌ని.. ప్ర‌భుత్వ భూముల్ని త‌మ‌కు రాయించాల‌ని అధికార పార్టీ నేత‌లు ఆదేశాలు ఇస్తున్నార‌ని, త‌హ‌శీల్దార్లు, కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది నిస్స‌హాయ స్థితిలో త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నార‌ని క‌లెక్ట‌ర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఉన్న‌తాధికారుల స‌మావేశంలో త‌మ‌ది పొలిటిక‌ల్ గ‌వ‌ర్నెన్స్ అని చెప్పార‌ని. దీంతో అధికార పార్టీ నేత‌లు మ‌రింత రెచ్చిపోతున్నార‌ని.. ఏ ర‌కంగా చూసినా, గ‌త ప్ర‌భుత్వ‌మే మేల‌నే రీతిలో ప్ర‌స్తుత పాల‌కులు దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని క‌లెక్ట‌ర్లు కొంత మంది విప‌క్ష నేత‌ల ద‌గ్గ‌ర చెబుతున్నారు.

ఇదే రీతిలో కూట‌మి నేత‌లు దారుణాలు కొన‌సాగితే, ఉద్యోగాలు చేయ‌లేమ‌ని వారు అవేద‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు విప‌క్ష నేత‌లు చెబుతున్నారు. కాగా, చంద్ర‌బాబు స‌ర్కార్‌లో ఇలాంటి దారుణాల్ని అస‌లు ఊహించ‌లేద‌ని కొంద‌రు కూట‌మి నేత‌లు సైతం అంటున్నారు.

19 Replies to “కూట‌మి నేత‌ల తీరుపై ఐఏఎస్ అధికారుల అస‌హ‌నం!”

  1. అసలు యే అరాచకం గురించి రాయాలన్నా మన అన్నియ్య అరచకాలనే reference గా వాడుతావ్ ఎందుకు GA ఎప్పుడు…😂😂😂…bench mark aa…

  2. Tcs ఆంధ్రకు వస్తుంది. 10 వేల మంది కి ఉపాధి అవకాశం . వైజాగ్ కు . పోలవరం 2800 కోట్లు ఫండ్ రిలీజు చేసారు కేంద్రం

    ఇక రైల్వే జోన్.డిసెంబర్ లో ముహూర్తం పెట్టారు . ఇలాంటి మంచి న్యూస్ లు కబడటం.లేదు

Comments are closed.