కెరీర్ కు కలిసిరాలేదు.. లైఫ్ లో కలిసొచ్చింది

ప్రతినిధి-2.. ఎన్నో ఆశలు పెట్టుకొని నారా రోహిత్ చేసిన సినిమా. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు నారా హీరో. కానీ అతడి ఆశలు నెరవేరలేదు. ప్రతినిధి-2 డిజాస్టర్…

ప్రతినిధి-2.. ఎన్నో ఆశలు పెట్టుకొని నారా రోహిత్ చేసిన సినిమా. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు నారా హీరో. కానీ అతడి ఆశలు నెరవేరలేదు. ప్రతినిధి-2 డిజాస్టర్ అయింది.

ఆ సినిమా రిలీజైందనే విషయమే చాలామందికి తెలియదంటూ ఓ సందర్భంలో తనపై తానే జోకులేసుకున్నాడు నారా రోహిత్. అలా ఈ హీరో కెరీర్ కు కలిసిరాని ఆ సినిమా, జీవితానికి మాత్రం బ్రహ్మాండంగా కలిసొచ్చింది.

40 ఏళ్ల నారా రోహిత్, జీవితంలో కొత్త దశలోకి ఎంటరయ్యాడు. శిరీష వేలికి ఉంగరం తొడిగాడు. వీళ్లిద్దరి నిశ్చితార్థం హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఇంతకీ ఈ శిరీష ఎవరో తెలుసా? ప్రతినిధి-2 సినిమాలో హీరోయిన్.

ఈ నిశ్చితార్థానికి ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ లాంటి వాళ్లు హాజరయ్యారు. సరిగ్గా ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఈ నిశ్చితార్థం జరిగింది. వేడుక ముగిసిన తర్వాత ఫొటోల్ని కూడా విడుదల చేశారు.

డిసెంబర్ లో నారా రోహిత్, శిరి వివాహం జరుగుతుంది. ప్రస్తుతం ఈ హీరో తన కొత్త సినిమా సుందరకాండ రిలీజ్ కోసం వెయిటింగ్.

5 Replies to “కెరీర్ కు కలిసిరాలేదు.. లైఫ్ లో కలిసొచ్చింది”

Comments are closed.