కూటమిలో అధ్యయన యాత్ర చిచ్చు

మహా విశాఖ నగర పాలక సంస్థ ప్రతీ ఏటా అధ్యయన యాత్రలు నిర్వహిస్తూ ఉంటుంది. కార్పోరేటర్లు దేశంలోని ఇతర కార్పోరేషన్లకు వెళ్ళి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని గమనించి విశాఖలో దానిని అమలు చేసేందుకు వీలుగా…

మహా విశాఖ నగర పాలక సంస్థ ప్రతీ ఏటా అధ్యయన యాత్రలు నిర్వహిస్తూ ఉంటుంది. కార్పోరేటర్లు దేశంలోని ఇతర కార్పోరేషన్లకు వెళ్ళి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని గమనించి విశాఖలో దానిని అమలు చేసేందుకు వీలుగా ఈ అధ్యయన యాత్రలు అని చెబుతూంటారు.

కానీ ఇవి కాస్తా చివరికి విహార యాత్రలుగా మారిపోతున్నాయని విమర్శలు ఉన్నాయి. విమానాలలో వెళ్ళి దేశంలోని ఇతర ప్రాంతాలలో బస చేయడం, అక్కడ ఖర్చులు అన్నీ కలసి తడిసి మోపెడుగా జీవీఎంసీకి పెను ఆర్ధిక భారంగా మారుతున్నాయి.

ప్రజలు కట్టే పన్నులతో వారికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఈ యాత్రల వల్ల దండుగ తప్ప మరేమీ లేదని మొదటి నుంచి వామపక్ష పార్టీలకు చెందిన కార్పోరేటర్లు చెబుతూనే ఉన్నారు. వారు యాత్రలకు ఎపుడూ దూరంగానే ఉంటున్నారు.

ఈసారి జీవీఎంసీ కార్పోరేటర్ల దక్షిణ భారత దేశ యాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ యాత్రను టీడీపీ కూటమిలోని కీలక పార్టీ అయిన జనసేన కార్పొరేటర్ వ్యతిరేకించడం విశేషం. యాత్రల వల్ల ఏమీ లాభం లేదని ఆయన అంటున్నారు. అలాగే సీపీఎం కి చెందిన మరో కార్పొరేటర్ కూడా యాత్రలను ఆపండని జీవీఎంసీ కమిషనర్ కి లేఖ రాశారు.

జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులలో అనేక చోట వీధి ధీపాలే వెలగడం లేదని, నాణ్యమైన రోడ్లు లేవని ఈ పరిస్థితులలో యాత్రలు చేయడం సబబు కాదని సీపీఎం తో పాటు జనసేన కార్పోరేటర్ కూడా అంటున్నారు. కార్పోరేటర్లు అందరూ ఈ యాత్రలను బహిష్కరించాలని వారు పిలుపు ఇస్తున్నారు. అయితే యాత్రలు చేసేందుకు ఇతర పార్టీలు మొగ్గు చూపిస్తున్నాయి. కూటమిలో ఉన్న టీడీపీ, బీజేపీ అయితే సరేననే అంటున్నాయి. అదే కూటమి నుంచి జనసేన విభేదించడం గమనార్హం.

6 Replies to “కూటమిలో అధ్యయన యాత్ర చిచ్చు”

  1. అంటే కూటమి లో కొందరన్న సరైన దారిలో ఉన్నారు…మరీ అన్న పార్టీ మాదిరి సాంతం నాకించేవారు కాకుండా

      1. ప్రియమైన లోకనాథరావు గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పినట్లు, మీరు మీ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా కాపు, కమ్మ కులాల మీద మీకున్న తీవ్రమైన ద్వేషంతో జీవిస్తున్నారని చెప్పాలి. మీరు ఎప్పుడూ కులం, కులం, కులం అని మాత్రమే మాట్లాడుతూ, కులాధారిత ద్వేషాన్ని ప్రోత్సహిస్తారు. ఈ ద్వేషం మీ మెదడులో తీవ్ర ఆవేశాన్ని నింపి, అది మీకు గుండె సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. కుల ద్వేషం వలన మీకు ఈ గుండె సమస్యలు రావడం ఎంత దురదృష్టకరం. కులం ఆధారంగా ద్వేషాన్ని పెంచుకోవడం వల్ల మీకు ఏమీ ఉపయోగం లేదు. మీలాంటి వారు, రంగనాథ్ లాంటి వారు ఎప్పుడూ కమ్మ, కాపు కులాలపై ద్వేషం పెంచుకోవడం వలన, అది మిమ్మల్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, మీరు ఇంకా మీ అసభ్యకరమైన స్వభావంతో కొనసాగుతూనే ఉన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ద్వేషించి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు 175 స్థానాల నుండి. మీకు సిగ్గు లేదా? ఈ జీవితాంతం కుల ద్వేషం ప్రోత్సహించడం ఏందుకు? ఇంత మంచి విద్య పొందిన మీరు, మీ చివర్లో సిగ్గులేని ఆలోచనలు చేయడం ఎంత దౌర్భాగ్యం.

        4o

Comments are closed.