సీన్ టు సీన్ లెక్కలు తీసేసారు

మెగాస్టార్ రెక్కల గుర్రం కాన్సెప్ట్ కూడా అలనాడు భైరవద్వీపంలో బాలయ్య వాడేసిందే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇవ్వాళ రేపు ఎక్కెడెక్కడి నుంచో సీన్లు కాపీ కొట్టేసి, ఇన్స్పైర్ అయ్యామనే రాజ‌మౌళి కథలు చెబితే జ‌నం నమ్మరు. దాన్ని కాపీనే అని కుండ బద్దలు కొట్టి మరీ ట్రోల్ చేస్తారు. నిన్నటికి నిన్న వచ్చిన విశ్వంభర టీజ‌ర్ ను ఏ ముక్కకు అ ముక్క పీకేసి ఎక్కడెక్కడి రిఫెరెన్స్ లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసారు. అసలే విఎఫ్‌ఎక్స్ క్వాలిటీ అప్ టు ది మార్క్ లేదు అన్నది ఒక సమస్య. అది సరే సెట్ చేసుకుంటారు. కానీ ఒక్క టీజ‌ర్ లోనే ఇన్ని రిఫెరెన్స్ లు వుంటే సినిమా మొత్తం రిఫరెన్స్ లతోనే కానిచ్చేసారు అని అనుకునే ప్రమాదం వుంది.

విశ్వంభర సినిమా టీజ‌ర్ జ‌స్ట్ కొద్ది నిమిషాలు మాత్రమే. కానీ డ్యూన్, అవెంజ‌ర్స్, అవతార్, జురాసిక్ వరల్డ్ ఇలా చాలా అంటే చాలా సినిమాల రిఫెరెన్స్ లు మినిట్ టు మినిట్ ఎక్కడెక్కడ వాడారో చూపించేసారు. పెద్ద చిన్న అందరు దర్శకులు కూడా రిఫరెన్స్ లు వాడతారు. కానీ ఎక్కడో ఒకటి రెండు చోట్ల. కానీ చిన్న టీజ‌ర్ లోనే స్టార్ట్ టు ఎండ్ రిఫరెన్స్ లు వున్నట్లుగా సోషల్ మీడియాలో మోసేయడం ఇదే తొలిసారి అనుకోవాలి.

మెగాస్టార్ రెక్కల గుర్రం కాన్సెప్ట్ కూడా అలనాడు భైరవద్వీపంలో బాలయ్య వాడేసిందే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దర్శకుడికి ఇది రెండో సినిమా. మొదటి సినిమా లో పాప పాత్ర కీలకం. ఇప్పుడు రెండో సినిమాలోనూ అదే కాన్సెప్ట్ వుందన్నట్లుగా చెబుతోంది టీజ‌ర్. ఏమైనా విశ్వంభర టీజ‌ర్ మీద మేకర్లు చాలా అంటే చాలా అశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంకా నాన్ థియేటర్ మార్కెట్ కాలేదు. థియేటర్ మార్కెట్ హోల్ సేల్ గా ఇద్దామనే ప్రయత్నాలు ముందుకు వెళ్లడం లేదు. రెండు వందల యాభై కోట్లకు పైగా ఇన్వెస్ట్ మెంట్.

టీజ‌ర్ సూపర్ డూపర్ క్లిక్ అయితే థియేటర్ మార్కెట్ ముందుకు సాగి వుండేది. కానీ ఇప్పుడు మరి కొంత కాలం అగాల్సిందే. కొత్త కంటెంట్ ను ఎట్ లీస్ట్ బయ్యర్లకు చూపించడం కోసం అన్నా రెడీ చేయాల్సిందే.

27 Replies to “సీన్ టు సీన్ లెక్కలు తీసేసారు”

  1. ఇంకానయం.. ఫలానా సినిమా లో మా హీరో బ్లాక్ ప్యాంట్ వేశాడు.. ఇక్కడా బ్లాక్ ప్యాంట్ వేశాడు అనే రేంజ్ లో కంపేర్ చేయలేదు

    1. సినిమా రిలీజ్ అయ్యే వరకు మనకు వీడి ఏడ్పు తప్పదు…. సినిమా హిట్ అయ్యింది అంటే మరొక రకమైన ఏడ్పు ఆర్టికల్స్, ఫ్లాప్ అయితే ఆనందంతో కొన్ని ఆర్టికల్స్……

  2. Rajamouli kaburlu – వెంకాయమ్మ నీకు గోరోజనం ఎక్కువైంది

    Please remember, jagga is no longer CM. He cant save you. Mind your language.

    1. Yes బ్రదర్, పిచ్చి రాతలు రాసే వాడికి కళ్ళు చెవులు కూడా పోయినట్టు ఉన్నాయి.

  3. Papam veediki vere news dorakadu. CBN ni comment chesthe redbook antu bokkalo vestharu. Ade chiranjeevi ni, lekapoythe Pawan Kalyan ni comment chesthe evaru emi cheyyaru. Vallu manchi vallu kabatti, edolendi papam brathukuthunnadu mega family peru cheppukuni

  4. Vfx ఇంకా బాగా చెయ్యాలి కొన్ని ఎక్కడో చూసాము అనే ఫీల్ వస్తుంది అలా వస్తే ఎంత పెద్ద హీరో ఉన్న కష్టమే

  5. ఒకే ఒక్క observation ఏమంటే ఏ ఇతర భాషల్లో heroes చేస్తే ఆహార్యంలో, రూపంలో తగినంత మార్పులు చూపించి authenticity పెంచుతారు. తెలుగు heroes ఎంతకాలం తాము మాత్రం సుందరంగా, తక్కిన పాత్రలన్నీ ఇత్తడి పాత్రల వలె చూపిస్తారు.

  6. చిరంజీవి cbn ని కలిసి చెక్కు ఇచ్చాడు కదా…ఇంక మనం సినిమా మీద negative గా రాయక పోతే ఎట్లా…కానీ కానీ

  7. Ala divided pics tho compare chesthe every movie still will be a copy still. Idi antha anti fans troll cheyadaniki chesindi. Teaser got 25m views in 24 hrs

  8. మూలిగే నక్క మీద తాటికాయ లాగ

    ముసలి హీరో కి ఎన్ని కస్టాలు 😂😂😂😂😂

    మూవీ ఎలాగూ దొబ్బడం ఖాయ్యం…..

    తాతయ్య తాతయ్య హో హో హో

Comments are closed.