ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నారు.. భాష జాగ్ర‌త్త‌!

ఇటీవ‌ల కాలంలో తెలంగాణ‌లో రాజ‌కీయ నాయ‌కుల మ‌ధ్య విమ‌ర్శ‌లు హ‌ద్దులు దాటాయి. మ‌రీ ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి , బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేశారు.…

ఇటీవ‌ల కాలంలో తెలంగాణ‌లో రాజ‌కీయ నాయ‌కుల మ‌ధ్య విమ‌ర్శ‌లు హ‌ద్దులు దాటాయి. మ‌రీ ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి , బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేశారు. అక్కినేని నాగార్జున కుటుంబాన్ని బ‌జారుకీడ్చారు. అలాగే హీరోయిన్ సమంత‌పై అన‌వ‌స‌రంగా ఆమె నోరు పారేసుకుని, ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అయ్యారు.

ఈ నేప‌థ్యంలో బండారు ద‌త్తాత్రేయ నిర్వ‌హించిన అల‌య్‌బ‌ల‌య్ కార్య‌క్ర‌మంలో కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి కామెంట్స్ ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. తెలంగాణ రాజ‌కీయ నాయ‌కుల విమ‌ర్శ‌ల్లో వాడుతున్న అభ్యంత‌ర‌క‌ర భాష‌ను ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నార‌ని ఆయ‌న అన్నారు. కావున భాష విష‌యంలో రాజ‌కీయ నాయ‌కులు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న హిత‌వు చెప్పారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్ర‌మే రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేసుకోవాల‌న్నారు. మిగిలిన సంద‌ర్బాల్లో అభివృద్ధిపై దృష్టి సారించాల‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ రాజ‌కీయాల్లో అనేక మార్పులుచేర్పులు చోటు చేసుకున్నాయ‌న్నారు. నాయ‌కుల ప్ర‌సంగాల్లో మార్పు రావాల్సిన అవ‌స‌రం వుంద‌న్నారు. ప్ర‌జ‌లు అస‌హ్యించుకునేలా మాట్లాడొద్ద‌ని ఆయ‌న అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్ని ర‌కాలుగా అయినా విమ‌ర్శ‌లు చేసుకుందామ‌ని ఆయ‌న అన్నారు.

3 Replies to “ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నారు.. భాష జాగ్ర‌త్త‌!”

Comments are closed.