విశాఖలో పరిశ్రమలు మూతపడుతున్నాయ్ సార్!

కొత్త పరిశ్రమలు తెస్తున్నామని కూటమి ప్రభుత్వ పెద్దలు ఒక వైపు గొప్పగా చెబుతున్నారు. కానీ చిత్రమేంటి అంటే ఉన్న పరిశ్రమలే మూతపడుతున్నాయి. ఇప్పటికే ఏపీకే తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ బలిపీఠం ఎక్కింది.…

కొత్త పరిశ్రమలు తెస్తున్నామని కూటమి ప్రభుత్వ పెద్దలు ఒక వైపు గొప్పగా చెబుతున్నారు. కానీ చిత్రమేంటి అంటే ఉన్న పరిశ్రమలే మూతపడుతున్నాయి. ఇప్పటికే ఏపీకే తలమానికంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ బలిపీఠం ఎక్కింది. దాని దశ దిశ ఎవరికీ తెలియదు.

అది ప్రైవేట్ రంగంలోకి వెళ్తే కనుక ఇక ఆశలు వదులుకోవాల్సిందే. ఒక వేళ ప్రైవేట్ వ్యక్తులు నడిపినా కూడా తక్కువ మందినే తీసుకుంటారు. లాభం లేదు అనుకుంటే షట్ డౌన్ చేస్తారు. లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా బతుకుతున్న స్టీల్ ప్లాంట్ మీద కూటమి పాలకులు దృష్టి పెట్టాలని డిమాండ్ ఉండనే ఉంది.

సెజ్ లలో భూములతో పాటు అన్నీ ఇచ్చినా పరిశ్రమలను మూసివేస్తున్న వారు ఎక్కువైపోతున్నారు. అలా ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురంలోని అభిజిత్ ఫెర్రో పరిశ్రమ లేటెస్ట్ గా అలాగే మూత పడిపోయింది. దానిని ఎవరికీ చెప్పకుండా మూసేసి అలా నోటీసు బోర్డు మీద అతికించారు.

దాంతో ఒక్కసారిగా వేయి మంది దాకా కార్మికులు రోడ్డున పడ్డారు. సెజ్ లకు తమ సొంత భూములు ఇచ్చామని తాము నిర్వాసితులం అయ్యామని అలాంటిది తమనే రోడ్డున పడేస్తారా అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఉన్నట్లుండి లే ఆఫ్ ని ప్రకటించడం పట్ల కార్మికులు మండిపడుతున్నారు. స్థానిక తహశీల్దార్ కి భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా ర్యాలీ తీసి మరీ వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అభిజిత్ ఫెర్రో పరిశ్రమను తెరిపించాలని డిమాండ్ చేశారు.

సెజ్ లో ఇంకా చాలా పరిశ్రమలు తమకు అనుకూలంగా పరిస్థితి లేకపోతే మూత వేసుకోవాలని చూస్తున్నాయి. ప్రభుత్వాలు భూమి నీరు విద్యుత్ ఉచితంగా ఇచ్చి పన్ను రాయితీ ఇచ్చి రెడ్ కార్పెట్ తో వారిని తెచ్చామని చెప్పుకుంటున్నాయి కానీ వచ్చిన వారు తమకు నచ్చకపోతే రాత్రికి రాత్రే తాళం వేస్తున్నారు. ముందు ఆ తాళాలు తెరిపిస్తే కొత్త వాటి మాట దేవుడెరుగు ఉన్న వారికీ ఉపాధి దక్కుతుందని అంటున్నారు.

6 Replies to “విశాఖలో పరిశ్రమలు మూతపడుతున్నాయ్ సార్!”

  1. షింగిల్ షింహం ని పోరాడమను ఎంకటి..

    ఎంతాసేపూ ఢిల్లీ వెళ్లి మెడలు వంచెయ్యటమేనా..గల్లీ లో కూడా పోరాడమని అన్నియ్యని అడుగు..

  2. మన పార్టీ అధికారం kolpeye సరికి మన సూట్ కేస్ company తట్ట బుట్ట సర్దారేమో

Comments are closed.