ఖరీదైన రెస్టారెంట్.. కిచెన్ లో పురుగులు

హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన హోటల్స్ లో అది కూడా ఒకటి. సిటీవాసులు గొప్పగా చెప్పుకునే శరత్ సిటీ మాల్ లో ఉంది ఆ రెస్టారెంట్. అక్కడ టీ తాగితే బిల్లు వంద రూపాయలు…

హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన హోటల్స్ లో అది కూడా ఒకటి. సిటీవాసులు గొప్పగా చెప్పుకునే శరత్ సిటీ మాల్ లో ఉంది ఆ రెస్టారెంట్. అక్కడ టీ తాగితే బిల్లు వంద రూపాయలు అవుతుంది. ఫ్రూట్ జ్యూస్ తాగితే 170 రూపాయలు. ఇక టిఫిన్, లంచ్ రేట్లు మీరు ఊహించుకోవచ్చు. ఆ రెస్టారెంట్ పేరు చట్నీస్. చాలామంది వినే ఉంటారు ఈ పేరు.

ఘనంగా చెప్పుకునే ఆ రెస్టారెంట్ లోకి ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్లారు. నేరుగా కిచెన్ లోకి ప్రవేశించారు. వెళ్లగానే వాళ్లకు గోధుమ పిండి, ఉప్మా రవ్వ కనిపించాయి. వాటినిండా నల్లటి పురుగులు. ఈ పిండితోనే పూరీ చేసి 160 రూపాయలకు అమ్ముతారక్కడ. చాలా రుచిగా ఉంటుందని అంతా చెబుతుంటారు. ఇక ఈ రవ్వతోనే ఉప్మా చేసి 90 రూపాయలకు పెడతారు. చాలామంది లొట్టలేసుకొని తింటారు.

మరోవైపు చూస్తే, పెద్ద డ్రమ్ అందులో బొద్దింకలు ప్రత్యక్షమయ్యాయి. ఎక్కడైతే సరుకులు భద్రపరిచాలో అక్కడంతా బొద్దింకలే. ఆ డబ్బాలో కందిపప్పు ఉంది. దాంతోనే దాల్ ఫ్రై, దాల్ మఖానీ, దాల్ తడ్కా లాంటి ఆహార పదార్థాలు చేసి ప్లేటు 260 రూపాయలకు అమ్ముతుంటారు.

ఇంకోవైపు చూస్తే.. ఉల్లిపాయలు, క్యాబేజీ. తినడానికి వీల్లేని, కుళ్లిన స్థితిలో ఉన్నాయి. దాదాపు అన్ని కర్రీస్ లో ఇవే ఉల్లిపాయల్ని వాడతారు. 50 శాతం ఇతర వంటకాల్లో ఇదే క్యాబేజీ పెడతారు. రేటు 3వందల రూపాయలకు ఏమాత్రం తగ్గదు.

కిచెన్ లో ఇతర పరిస్థితుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. వాష్ ఏరియాలో ఒకటే కంపు. భోజనం వడ్డించేవాళ్లు, తయారుచేసేవాళ్లు ఎవ్వరూ రూల్స్ పాటించడం లేదు.

చివరికి కూరగాయలు తరిగే కత్తి కూడా స్టీల్ ది వాడడం లేదు. ఇనుప కత్తి వాడుతున్నారు. బాత్రూమ్స్, ఫ్లోర్, సింక్ కడిగే శానిటరీ లిక్విడ్స్ ను సరుకులతో కలిపి స్టోర్ చేయడం విశేషం. ఇదీ ఘనంగా చెప్పుకునే చట్నీస్ అసలు స్వరూపం.

11 Replies to “ఖరీదైన రెస్టారెంట్.. కిచెన్ లో పురుగులు”

  1. బయట ఎక్కడ తిన్నా ఇదే పరిస్థితి.. ఇంట్లో మాత్రం అందరూ శుభ్రంగా ఉంటారని చెప్పడానికి లేదు…

  2. ముక్కోడు వాడి కుటుంబం మనవళ్లు , డ్రామా రావు గాడు వాడి పిల్లలు లండన్ నుంచి వచ్చినప్పుడు లొట్టలేసుకుంటూ తినే రెస్టారెంట్ ఇదే

  3. షర్మిలక్క ఏదో ఒకటి చేసి కాపాడుతుందిలే, తన కొడుకే కదా చట్నీస్ అల్లుడు.

  4. రేవంత్ వచ్చాక డ్రగ్స్, హోటల్స్ పైన దాడులు బాగా జరుగుతున్నాయి. ఇంతకు ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ వీటిని వదిలి పడేసింది. పదేళ్లలో తెలంగాణ నీ నాశనం చేశారు.

Comments are closed.