సంక్రాంతికి వస్తున్నాం అనే వర్కింగ్ టైటిల్ లో చాలా హుషారుగా సినిమా స్టార్ట్ చేసారు నిర్మాత దిల్ రాజు- దర్శకుడు అనిల్ రావిపూడి- హీరో వెంకటేష్ కలిసి. చకచకా సినిమా షూట్ జరిగింది. నవంబర్ 20 నాటికి మొత్తం టాకీ కాపీ రెడీ అయిపోతుంది. కానీ సంక్రాంతికి విడుదల అన్నది మాత్రం డైలామాలో పడిపోయింది. వస్తుంది..లేదా రాదు అన్నది అఫీషియల్ క్లారిటీ లేదు. గేమ్ చేంజర్ విడుదలను అఫీషియల్ గా ప్రకటించారు. కానీ ఈ సినిమా డేట్ మారిందా లేదా అన్నది మాత్రం అఫీషియల్ గా ఇంత వరకు ప్రకటించలేదు.
దర్శకుడు అనిల్ రావిపూడి సైలెంట్ గా వున్నారు. తన పని తాను చేసుకుంటున్నారు. నిర్మాత దిల్ రాజు గేమ్ ఛేంజర్ పనుల్లో బిజీగా వున్నారు. అందువల్ల సినిమా విడుదల మీద క్లారిటీ అయితే ఇప్పట్లో వచ్చే అవకాశం తక్కువ. దీపావళికి ఏ పోస్టర్ అన్నా విడుదల చేస్తే, దాని మీద విడుదల తేదీ వుంటే అప్పుడు క్లారిటీ రావాల్సి వుంటుంది.
ఇదిలా వుంటే ఇంకో గ్యాసిప్ చక్కర్లు కొడుతోంది. హీరో వెంకటేష్ ఈ సినిమాను తన చేతుల్లోకి తీసుకుని, రెండు రాష్ట్రాల్లో సురేష్ సంస్థ ద్వారా విడుదల చేయిస్తారన్నది అ గ్యాసిప్. నిర్మాత దిల్ రాజునే పంపిణీ రంగంలో కింగ్ గా వున్నారు. కానీ సంక్రాంతి పరిస్థితుల రీత్యా అవసరం అయితే సినిమాను తన సురేష్ సంస్థ ద్వారా చేతుల్లోకి తీసుకునే అలోచన వెంకటేష్ కు వుందన్న గ్యాసిప్ వినిపిస్తోంది.
vc available 9380537747
ఎవరి చేతుల్లోకి తీసుకున్నా థియేటర్లో చూడం