అనుష్క ఈసారి కచ్చితంగా రావాల్సిందే!

అనుష్క సినిమాలు ఆపలేదు, తగ్గించిందంతే. మీడియాకు దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ సైలెంట్ గా 2 సినిమాలు పూర్తిచేసింది. వచ్చే ఏడాది ఈ 2 సినిమాలు మినిమం గ్యాప్ లో రిలీజ్ కాబోతున్నాయి. Advertisement…

అనుష్క సినిమాలు ఆపలేదు, తగ్గించిందంతే. మీడియాకు దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ సైలెంట్ గా 2 సినిమాలు పూర్తిచేసింది. వచ్చే ఏడాది ఈ 2 సినిమాలు మినిమం గ్యాప్ లో రిలీజ్ కాబోతున్నాయి.

అనుష్క నటించిన మలయాళం సినిమా కథనార్. మలయాళంలో ఆమెకిదే తొలి చిత్రం. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఫాంటసీ హారర్ థ్రిల్లర్ గా దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది.

ఇక తెలుగులో నేరుగా ‘ఘాటీ’ అనే సినిమా చేస్తోంది అనుష్క. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు కొలిక్కి వచ్చేసింది.

ఇప్పుడీ రెండు సినిమాల్లో ముందుగా అనుష్క నటించిన కథనార్ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశం ఉంది. తెలుగులో కూడా ఇదే పేరుతో సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఇలా సైలెంట్ గా 2 సినిమాల్ని సిద్ధం చేసింది బొమ్మాలి. ఆమె గత చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. అనుష్క లేకుండానే ఆ సినిమాకు ప్రచారం చేసి విడుదల చేశారు. అందులో నవీన్ పొలిశెట్టి ఉన్నాడు కాబట్టి, ప్రచారం విషయంలో అనుష్క లేని లోటు పెద్దగా తెలియలేదు.

కానీ ఈసారి అలా కుదరదు. కథనార్ కోసమైనా, ఘాటీ కోసమైనా, అనుష్క మీడియా ముందుకు రావాల్సిందే. లేదంటే ఆ సినిమాల ప్రచారం సాగదు. మరి ఈసారి అనుష్క తో పాటు మేకర్స్ ఎలా ప్లాన్ చేయబోతున్నారో చూడాలి.

One Reply to “అనుష్క ఈసారి కచ్చితంగా రావాల్సిందే!”

Comments are closed.