పోతుల సునీత‌.. రాజ‌కీయ దారేది?

వైసీపీకి రాజీనామా చేసిన మ‌హిళా నాయ‌కురాలు పోతుల సునీత రాజ‌కీయ భ‌విష్య‌త్ సందిగ్ధంలో ప‌డింది. అధికారం త‌ప్ప‌, మ‌రేదీ త‌మ‌కు అవ‌స‌రం లేద‌నే స్వార్థ చింత‌న‌తో పోతుల సునీత వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కార‌ణంగా ఆమెపై అన్ని…

వైసీపీకి రాజీనామా చేసిన మ‌హిళా నాయ‌కురాలు పోతుల సునీత రాజ‌కీయ భ‌విష్య‌త్ సందిగ్ధంలో ప‌డింది. అధికారం త‌ప్ప‌, మ‌రేదీ త‌మ‌కు అవ‌స‌రం లేద‌నే స్వార్థ చింత‌న‌తో పోతుల సునీత వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కార‌ణంగా ఆమెపై అన్ని రాజ‌కీయ ప‌క్షాల్లోనూ వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది.

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన పోతుల సునీత టీడీపీ నుంచి రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లు పెట్టారు. ఆమె కుటుంబానికి ప‌రిటాల సునీత కుటుంబంతో మంచి సంబంధాలున్నాయి. సునీత భ‌ర్త సురేష్ విప్ల‌వ రాజ‌కీయాల నుంచి వ‌చ్చారు. ప‌రిటాల ర‌వికి ముఖ్య అనుచ‌రుడిగా మెలిగారు. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఆ పార్టీలో కీల‌కంగా పోతుల సునీత వ్య‌వ‌హ‌రించారు.

2019లో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీలో సునీత దంప‌తులు చేరారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. అలాగే వైసీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలిగా పోతుల సునీత క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై ఆమె విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్‌కు ఎంతో న‌మ్మ‌కంగా ఉన్న‌ట్టు క‌నిపించారు.

అయితే 2024లో అధికారంలో పోగానే, ఆమెలో స్వార్థం మేల్కొంది. పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి, ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. టీడీపీలో చేరాల‌నే ప్ర‌య‌త్నాల్ని ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్య‌తిరేకించాయి. గ‌తంలో భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణిల‌పై సునీత అవాకులు చెవాకులు పేల‌డాన్ని ఆ పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టీడీపీలోకి రానిచ్చేది లేద‌ని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు తేల్చి చెప్పారు. దీంతో పోతుల సునీత రాజ‌కీయ భ‌విష్య‌త్ ప్ర‌స్తుతానికి సందిగ్ధంలో ప‌డింది. రానున్న రోజుల్లో ఏమ‌వుతుందో చూడాలి.

9 Replies to “పోతుల సునీత‌.. రాజ‌కీయ దారేది?”

  1. Almost as Galeeju drty like kinda Surekha. TDP and Janasena must allow and see them to continue to dust bin of history. She abused Lokesh in unprintable language. Sadly,most BC/SC have this desperation to satisfy the upper cast bosses

  2. చంద్రబాబు ఇంట్లో ఆడోళ్లను తిడితే జగన్ రెడ్డి పదవులు ఇచ్చేస్తాడనే వీక్ పాయింట్ మీద కొట్టింది.. ఎమ్మెల్సీ అయిపొయింది.. సింపుల్..

    జగన్ రెడ్డి ని ప్రసన్నం చేసుకోవాలంటే.. జగన్ రెడ్డి ని పొగిడితే .. ఒక మంత్రి పదవి బహుమానం..

    అదే.. చంద్రబాబు ఇంట్లో ఆడోళ్లను తిడితే.. రెండు మంత్రి పదవులు బహుమానం..

Comments are closed.