మొన్నటివరకు లే-ఆఫ్స్ అనేది పెద్ద టాపిక్. ఎన్నో టెక్ కంపెనీలు ‘ఖర్చుల తగ్గింపు’ పేరిట తమ సంస్థల్లో ఉద్యోగుల్ని తొలగించాయి. అయితే ఆ తర్వాత అదే పెద్ద బర్నింగ్ టాపిక్ గా మారింది. ఎన్నో సంస్థలపై ప్రతికూల ప్రభావం కూడా చూపించింది.
దీంతో చాలా కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగాల తొలిగింపునకు కొత్త పద్ధతి ఎంచుకున్నాయి. అదే సైలెంట్ ఫైరింగ్. ఈ పద్ధతి ఉద్యోగులకు మరింత ప్రమాదకరం.
సైలెంట్ ఫైరింగ్ అంటే ఏంటి..?
ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చిన పేరు కాదు. తెలుగులో స్పష్టంగా చెప్పాలంటే “పొమ్మనలేక పొగబెట్టడం” అన్నమాట. ఎంపిక చేసిన ఉద్యోగులకు కంపెనీలో అసౌకర్య పరిస్థితులు సృష్టిస్తారు. మెయిల్స్ తో నిరుత్సాహపరుస్తారు. తద్వారా ఉద్యోగులే కంపెనీని వీడే పరిస్థితిని కల్పిస్తారు. ఇదంతా జరగడానికి కాస్త టైమ్ పడుతుంది కానీ కంపెనీకి చాలా లాభం. సదరు ఉద్యోగికి నష్ట పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చాలా కంపెనీలు ఈ విధానాన్నే అనుసరిస్తున్నాయి.
సైలెంట్ ఫైరింగ్ లో మరో రకం కూడా ఉంది. మొన్నటివరకు బల్క్ లే-ఆఫ్స్ చూశాం. తమ ఉద్యోగులను 15 నుంచి 20 శాతం మందిని తొలిగించే ప్రక్రియ అది. సైలెంట్ ఫైరింగ్ లో మాత్రం అలా చేయరు. ఒక్కో డిపార్ట్ మెంట్ నుంచి 2శాతం లేదా 3 శాతం ఉద్యోగుల్ని తొలిగిస్తారు. ఇలా ప్రతినెల చేస్తారు. అదే టైమ్ లో వాళ్లకు ప్రతికూల పని వాతావరణాన్ని సృష్టిస్తారు.
దీని వల్ల కంపెనీలకే లాభం..
బల్క్ ఫైరింగ్స్ లో ఉద్యోగులకు కనీసం నష్టపరిహారం (ఎగ్జిట్ ప్యాకేజీ) అయినా దక్కుతుంది. సైలెంట్ ఫైరింగ్ లో అది కూడా ఉండదు. ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. కాకపోతే ఇక్కడ కూడా బల్క్ లే-ఆఫ్స్ తరహాలోనే ఉద్యోగికి పరోక్షంగా సంకేతాలిస్తారు. 2 నెల ముందు నుంచే ఉద్యోగికి సెగ తగులుతుంది. ఈలోగా వేరే చోట జాబ్ వెదుక్కోవాలి. లేదంటే అంతే సంగతి.
ప్రతి కంపెనీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీని అనువర్తింపజేసే పనిలో ఉంది. వ్యవస్థలో ఆటోమేషన్ వచ్చిందంటే చాలామంది ఉద్యోగులకు పని ఉండదు. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పట్నుంచే సైలెంట్ ఫైరింగ్స్ ను అమల్లోకి తెస్తున్నాయి చాలా కంపెనీలు.
ఉద్యోగులకు బాధ్యతలు తగ్గించడం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు నిలిపివేయడం, పని చేసే అవకాశాలు తగ్గించడం లాంటివి ఇప్పుడు చాలా టెక్ కంపెనీల్లో కామన్ అయిపోయాయి. పైకి గొప్పగా చెప్పుకునే కంపెనీల్లో ఉద్యోగులకు బేసిక్ పై 7 శాతం ఇంక్రిమెంట్ ఇస్తే అదే గొప్ప అన్నట్టుంది పరిస్థితి. ఇక ప్రమోషన్ గురించి మాట్లాడుకోవడం దండగ అన్నట్టుగా మారింది ఐటీ రంగం. ఉన్న పెర్క్స్ కట్ చేయకుండా ఉంటే అదే చాలు అంటున్నారు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.
మొత్తమ్మీద సైలెంట్ ఫైరింగ్ అనేది టెక్ ఉద్యోగులకు ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారింది. మొన్నటివరకు డిపార్ట్ మెంట్ వారీగా ఇది ఉండేది. టీమ్ లీడ్ కు నచ్చకపోతే ఇలాంటి పనులు చేసేవాడు. కానీ ఇప్పుడు నేరుగా కంపెనీలే టీమ్ లీడ్స్ లో ఇలాంటి పనులు చేయిస్తున్నాయి.
ఉద్యోగులు కూడా వాళ్ల తెలివి వాళ్ళు చూపిస్తారు , ఎక్కడ ఎలా గు ద్ద దెంగాలో అలా సైలెంట్ గా గు ద్ద దెం గి వదుల్తారు , అల్టిమేట్ గా వర్క్ చేయాల్సింది ఆ ఉద్యోగులే , కొంతమందిని అలా చేస్తే మిగిలిన వారి మోరల్ దెబ్హ తింటాది అది వర్క్ మీద చూపిస్తారు
Call boy jobs available 9989793850
ఈ కాలం చాలా వ్యాపారాల్లో మార్జిన్ చాలా ఉంటోంది.. ఐటి గురించి చెప్పేదేముంది.. పెద్ద మనుషులు సరదాగా అలా ఆటలు అడుకుంటారు.. పోయే వాళ్ళు పోతే ఉన్న వాళ్ళతో ఆ గొడ్డు చాకిరీ కూడా చేయిస్తారు.. చేయడానికి చాలా మందే ఉత్సాహం చూపుతారు.. ఎలాగో ప్రతి ఏడు పుట్టగొడుగుల్లాగా ఇంజనీర్ లు పుట్టుకొస్తారు.. వాళ్ళని గంప గుత్తగా పట్టుకొస్తారు.. వెట్టి చాకిరీ చేయిస్తారు…
okari kinda panicheyatam eppatikaina banisatvame