జనసేనలో ఆశావహులకు నిరాశ

ఏపీలో వంద దాకా కార్పోరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి. అందులో కీలకమైన మిత్రక్షంగా ఉన్న జనసేనకు దక్కినవి చూస్తే చాలా తక్కువ. ప్రాధాన్యత కలిగిన పోస్టులు కూడా టీడీపీకే దక్కాయని అంటున్నారు. Advertisement విశాఖ…

ఏపీలో వంద దాకా కార్పోరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి. అందులో కీలకమైన మిత్రక్షంగా ఉన్న జనసేనకు దక్కినవి చూస్తే చాలా తక్కువ. ప్రాధాన్యత కలిగిన పోస్టులు కూడా టీడీపీకే దక్కాయని అంటున్నారు.

విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ పదవిని టీడీపీ నేతకే ఇచ్చారు. ఈ పదవి కోసం కూటమిలోని మిత్రులు కూడా ఆశ పడ్డారని ప్రచారం సాగింది. విశాఖలో ఇది కీలకమైన పదవిగా ఉంది. ఏపీలోనే మెగా సిటీగా ఉన్న విశాఖలో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా సాగుతోంది. దాంతో ఈ పదవి చాలా ముఖ్యమైనది ప్రతిష్టాత్మకమైనదిగా అంతా భావించారు.

నామినేటెడ్ పదవుల కోసం జనసేనలో కొందరు కీలక నేతలు కూడా ఎదురుచూశారని ప్రచారం సాగింది. విశాఖలో జనసేనకు చెప్పుకోదగిన నేతలు చాలా మంది ఉన్నారు. వారంతా ఇటీవల కాలంలో మరింత యాక్టివ్ గా మీడియా ముందుకు వచ్చి మరీ వైసీపీ మీద విమర్శలు చేస్తూ ఫోకస్ అయ్యారు.

అయితే టీడీపీ జనసేనకు ఇవ్వాల్సిన పోస్టులు ఎన్నో లెక్క కట్టి మరీ ఇచ్చింది. జనసేన ప్రాధాన్యత ఏపీ రాజకీయాల్లో ఆ పార్టీ పోషిస్తున్న ముఖ్య భూమికను తీసుకుంటే ఇంకా ఎక్కువ పదవులే దక్కాల్సింది అని జనసేనలో అయితే వినిపిస్తోంది అని అంటున్నారు.

గోదావరి జిల్లాల తరువాత విశాఖలో జనసేనకు బలం బాగా ఉంది. కీలకమైన జిల్లాలో నామినేటెడ్ పదవులు అనుకున్న వారికి దక్కలేదు అని అంటున్నారు. చివరి విడతలో అయినా చాన్స్ ఇస్తారా లేదా అన్నది చూడాలన్న ఆలోచనతో జనసేన నేతలు ఉన్నారని అంటున్నారు.

5 Replies to “జనసేనలో ఆశావహులకు నిరాశ”

  1. జనసేనకి అంత బలం వుందని ఇప్పుడే తెలిసిందే, ఎలక్షన్స్ ముందు కూడా తెలుసా? ఎలక్షన్స్ కి ముందే తెలిసుంటే సింగల్ సింహం అని పోస్కోలు కబుర్లు ఎందుకు

    చెప్పారు..?

  2. కన్నింగ్ మోడీ , బీజేపీ లోపాయకారి సహాయంతో ఒక్క చాన్సు అని 2019 అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి బీజేపీ కి ఏమి పదవులు ఇచ్చాడు ?

Comments are closed.