తగదా తీరలేదు, సూర్య సినిమాకు తీరని అన్యాయం జరిగింది. వాళ్లువీళ్లు గొడవ పడి మధ్యలో సూర్య సినిమాకు అన్యాయం చేశారు. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయం సొంతం చేసుకోవాలని కలలుగన్న సూర్య ఆశలకు ఆదిలోనే స్పీడ్ బ్రేకర్ పడింది.
రాత్రికి అంతా సద్దుమణుగుతుందని భావించినప్పటికీ రెండు పార్టీలు బెట్టువీడినట్టు కనిపించలేదు. దీంతో హైదరాబాద్ తో పాటు నైజాంలోని కీలకమైన ఏరియాల్లో మేజర్ థియేటర్లు లేకుండానే కంగువా సినిమా ఈరోజు రిలీజైంది.
పుష్ప-2ను దృష్టిలో పెట్టుకొని మైత్రీ ఆడిన ఈ గేమ్ లో కంగువా బలిపశువుగా మారింది. అంతేకాదు, ఈ వ్యవహారం వల్ల నైజాంలో 2 పెద్ద ప్లేయర్స్ మధ్య గొడవ మరింత ముదిరినట్టయింది.
ఏషియన్ గ్రూప్ కు నైజాంలో భారీ సంఖ్యలో స్క్రీన్స్ ఉన్నాయి. వాటిలో 30 శాతం కూడా కంగువా సినిమాకు దక్కలేదు. హైదరాబాద్ లో కీలకమైన ఏఎంబీ, ఏఏఏ స్క్రీన్స్ కూడా ఆఖరి నిమిషంలో అందుబాటులోకి వచ్చాయి. ఇవి కూడా దక్కకపోతే, హైదరాబాద్ లో కంగువా పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.
అటు పీవీఆర్ పరిస్థితి కూడా అంతే. హైదరాబాద్ లో కేవలం ఒకేఒక్క పీవీఆర్ స్క్రీన్ కంగువాకు దక్కిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మేజర్ సెంటర్స్ లో ఒక్కటంటే ఒక్క పీవీఆర్ స్క్రీన్ కూడా సూర్య సినిమాకు లేదు. తాజా వివాదం సూర్య సినిమా ఓపెనింగ్స్ పై పెను ప్రభావం చూపించింది.
vc available 9380537747
vc estanu 9380537747
Adi dubbing cinema nuvvu anduku feel avutunnav mana cinema Ki Tamil Nadu lo intha kanna goramaina paristiti
K Ki Tamil Nadu lo no theatre s appuduporadavalisindi
ఇద్దరూ ప్లేయర్స్ సినీ పరిశ్రమకు గుది బండ లాగా తయారు కాకుండా ఉంటే మంచిది.
సూర్యకి అన్యాయం జరిగి వుండవచ్చు. మరి మన తెలుగు సినిమా “క” కి అన్యాయం జరిగినప్పుడు ఏం చేశారు మీరు?
అందుకే డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ చెయ్యాలి