కంగువాపై ఎందుకంత నెగిటివిటీ

సూర్య హీరోగా నటించిన కంగువా సినిమాపై అన్ని భాషల్లో దాదాపు ఒకే రకమైన మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత అది ఫ్లాప్ టాక్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై సూర్య…

సూర్య హీరోగా నటించిన కంగువా సినిమాపై అన్ని భాషల్లో దాదాపు ఒకే రకమైన మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత అది ఫ్లాప్ టాక్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై సూర్య భార్య జ్యోతిక స్పందించింది. కంగువా సినిమాపై ఎందుకంత నెగిటివిటీ అని ప్రశ్నిస్తోంది జ్యోతిక.

సూర్య భార్యగా కాకుండా.. ఓ సినీ అభిమానిగా, జ్యోతికగా ఈ లెటర్ రాస్తున్నానంటూ ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. తప్పులు ఎంచుతూనే, సినిమా అద్భుతంగా ఉందని కొనియాడింది.

అందరూ విమర్శించినట్టుగానే కంగువాలో సౌండ్ సిస్టమ్ బాగాలేదని జ్యోతిక కూడా విమర్శించింది. దీంతో పాటు సినిమా ప్రారంభమైన 30 నిమిషాలు బాగాలేదని కూడా చెప్పుకొచ్చింది. అంతమాత్రాన, 3 గంటల సినిమాను ఎలా జడ్జ్ చేస్తారని సమీక్షకుల్ని ప్రశ్నిస్తోంది జ్యోతిక.

కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తుల నుంచి వచ్చిన నెగెటివ్ రివ్యూలు చూసి షాక్ అయ్యానంటోంది జ్యోతిక. పాత చింతకాయపచ్చడి కథలు, అమ్మాయిల్ని ఇబ్బందిపెడుతూ వెంటపడే సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఉన్న చాలా పెద్ద సినిమాల విషయంలో కూడా ఇంత నెగెటివ్ గా ఎప్పుడూ రివ్యూలు చూడలేదని అభిప్రాయపడింది.

కంగువాలో తప్పుల్ని మాత్రమే చూస్తున్నారని, మహిళా సాధికరతను తెలియజేసే సన్నివేశాలు, కంగువాపై చిన్న పిల్లాడు చూపించే ద్వేషం-ప్రేమ లాంటి మంచి ఎపిసోడ్స్ ను రివ్యూల్లో ప్రస్తావించలేదంటోంది. కంగువా రిలీజైన మొదటి రోజు, మరీ ముఖ్యంగా మొదటి ఆట కూడా పూర్తవ్వకముందే పుంఖానుపంఖాలుగా వ్యతిరేక కథనాలు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని, ప్రయోగాత్మకంగా కంగువాను నిర్మించి, తమిళ సినిమా స్థాయిని పెంచారని మెచ్చుకున్న జ్యోతిక.. అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇచ్చారంటూ యూనిట్ ను ప్రశంసించింది.

12 Replies to “కంగువాపై ఎందుకంత నెగిటివిటీ”

  1. ప్రేక్షకులను తప్పుపట్టడం జ్యోతిక తప్పు. మొన్న ఇదే కార్తీ సత్యం సుందరంతో మాంచి హిట్ కొట్టాడు తెలుగులో. తమిళ్ లో కంటే తెలుగులోనే మంచి పేరు తెచ్చుకుంది. ఇష్టం వచ్చినట్టు సినిమా తీసి జనాల మీదికి వదిలితే ఇలాగే ఉంటుంది. Respect audience choice.

  2. సత్యం సుందరం బాగుంది దానిని ఎవరూ టార్గెట్ చేయలేదు కేవలం కంగువ ని మాత్రమే అంటున్నారు అంటే సినిమా ప్రేక్షకులను ఎలా విసిగించిందో అర్థం చేసుకోవాలి respect audience

  3. “గంగ చంద్రముఖి గా మారిపోయింది ” అన్నట్లు రాసారు ఈ ఆర్టికల్ ఓపెనింగ్

    గంగ ఓపెన్ లెటర్ కన్విన్సింగ్ గా లేదు

Comments are closed.