నయనతార-ధనుష్ గొడవ.. అసలు కారణం ఇదేనా?

తన యాక్టింగ్, నిర్మాతకు నచ్చలేదని, నెక్ట్స్ టైమ్ బాగా నటిస్తానంటూ ఓ చేతిలో అవార్డ్ పట్టుకొని, ధనుష్ పై పరోక్షంగా సెటైర్లు వేసింది.

ధనుష్ పై నయనతార ఓపెన్ లెటర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తన లైఫ్-కెరీర్ కు సంబంధించిన డాక్యుమెంటరీని అడ్డుకునేందుకు ధనుష్ ప్రయత్నిస్తున్నాడని, రెండేళ్లుగా ఎన్ఓసీ ఇవ్వడం లేదని ఆమె ఆరోపించింది. అంతేకాదు, ధనుష్ పాతాళానికి దిగజారాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

అసలు వీళ్లిద్దరి మధ్య సంబంధాలు ఎక్కడ దెబ్బతిన్నాయి? ధనుష్-నయన్ మధ్య గొడవలు చెలరేగడానికి అసలు కారణం ఏంటి?

పదేళ్ల కిందట ధనుష్ నిర్మాతగా నయనతార సినిమా చేసింది. దానికి విఘ్నేష్ శివన్ దర్శకుడు. ఆ టైమ్ లోనే నయన్-విఘ్నేష్ దగ్గరయ్యారు. బాగా ప్రేమించుకున్నారు. ఇది ధనుష్ కు నచ్చలేదు. ‘వాళ్లు ప్రేమించుకోవడానికి నేను డబ్బులు పెట్టి సినిమా తీయాలా’ అనేది ధనుష్ ఫీలింగ్. ఎందుకంటే, అప్పటికే బడ్జెట్ చేయిదాటిపోయింది.

అనుకున్న బడ్జెట్ ను మించి ఖర్చవ్వడంతో ఒక దశలో ధనుష్, ఈ సినిమా షూటింగ్ ఆపేశాడట. అప్పటికే విఘ్నేష్ తో ప్రేమలో ఉన్న నయనతార తను ఫైనాన్స్ చేసి ఆ సినిమాను గట్టెక్కించిందని చెబుతారు చాలామంది.

ధనుష్-నయన్ మధ్య గొడవకు ఇదొక కారణమైతే… ఆ సినిమాలో నయనతార నటనపై ధనుష్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. సరిగ్గా నటించడం లేదని, సినిమాను వృధా చేస్తోందని విమర్శలు చేసినట్టు అప్పట్లో కథనాలొచ్చాయి.

కట్ చేస్తే.. ‘నేనూ రౌడీనే’ సినిమాలో నటనకు గాను నయనతారకు ఉత్తమ నటిగా అవార్డ్ వచ్చింది. అదే అవార్డ్ ఫంక్షన్ కు ధనుష్ కూడా వచ్చాడు. నిండు సభలో వేదికపై ధనుష్ ఇగో హర్ట్ అయ్యేలా నయనతార మాట్లాడింది. తన యాక్టింగ్, నిర్మాతకు నచ్చలేదని, నెక్ట్స్ టైమ్ బాగా నటిస్తానంటూ ఓ చేతిలో అవార్డ్ పట్టుకొని, ధనుష్ పై పరోక్షంగా సెటైర్లు వేసింది.

ఇలా ధనుష్-నయన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్న డాక్యుమెంటరీ విషయానికొస్తే, నయనతార దీన్ని ఉచితంగా చేయడం లేదు. నెట్ ఫ్లిక్స్ నుంచి భారీగా డబ్బు తీసుకొని, పూర్తిగా వ్యక్తిగతమైన తన పెళ్లి రైట్స్ ను కూడా అమ్ముకొని డాక్యుమెంటరీకి ఓకే చెప్పిందట.

తను డబ్బులు పెట్టి సినిమా తీస్తే, దాన్ని తన ప్రేమ కోసం వాడుకున్న నయనతార, ఇప్పుడు అదే సినిమాను తన డాక్యుమెంటరీ కోసం కూడా వాడుకోవడం, పైగా దాన్ని అమ్ముకోవడం ధనుష్ కు నచ్చలేదంటున్నారు అతడి క్లోజ్ సర్కిల్. అలాంటప్పుడు తన సినిమా రైట్స్ ను ఎందుకు ఉచితంగా ఇవ్వాలనేది ఇతడి ప్రశ్న. లీగల్ నోటీసుకు ప్రధాన కారణం ఇదేననే చర్చ కోలీవుడ్ లో సాగుతోంది.

నయనతార ఎంత ఘాటుగా బహిరంగ లేఖ రాసినా, కాపీరైట్ చట్టం ముందు ఆమె వాదనలు నిలబడవు. తన సొంత ఫోన్ నుంచి షూట్ చేసిన క్లిప్స్ నెట్ ఫ్లిక్స్ కోసం వాడినప్పటికీ, అది ధనుష్ కు చెందిన ప్రాపర్టీ కిందకే వస్తుంది. పైపెచ్చు, తన అనుమతి లేకుండా షూట్ చేసినందుకు, దాన్ని వాణిజ్య అవసరాలకు వాడుకున్నందుకు నయనతారపై ధనుష్ మరో కేసు కూడా పెట్టొచ్చంటున్నారు లీగల్ నిపుణులు. నయనతార ఆరోపిస్తున్నట్టు అది పదేళ్ల కిందటి సినిమానా, తాజా చిత్రమా అనే విషయంతో అస్సలు సంబంధం లేదని చెబుతున్నారు.

29 Replies to “నయనతార-ధనుష్ గొడవ.. అసలు కారణం ఇదేనా?”

    1. మీరు అలా అనకండి సర్..

      ఇప్పుడు ఏదైనా ఆర్టికల్ కోసం.. జగన్ రెడ్డి కోసం “జన సునామి” అంటూ ఆర్టికల్ వదులుతాడు..

      వాడి దరిద్రపు ప్రెస్ మీట్ పైన ఆర్టికల్స్ వదులుతాడు..

      ఆ ఛండాలం కన్నా.. ఈ లంచ్ టైం లో సాంబార్ తాగేయండి..

  1. 2 సంవత్సరాలు వెయిట్ చేయక పోతే….ఆ scene మళ్ళీ రిక్రియేట్ చేసుకుని ఉండొచ్చు కదా

  2. అది తెలుగు హిరొలను ఎర్రి పుష్పాలుగా చూస్తుంది

    అది.. దాని attitude

    నిర్మాతలకు పగలె చుక్కలు చూపించె ఇది..ఇప్పుడు పరమాన్నం కబుర్లు చెపితె ఎలా

  3. అది తెలుగు హిరొలను ఎ..ర్రి పు..ష్పా..లుగా చూస్తుంది

    అది.. దాని attitude

    నిర్మాతలకు పగలె చుక్కలు చూపించె ఇది..ఇప్పుడు పరమాన్నం కబుర్లు చెపితె ఎలా

  4. రేయ్ సంగీ గుట గుట ఆంధ్రా… నీకు సరిపోయే ఆర్టికల్స్ ఇవే… నువ్వు ఊరికే ఆ పొట్టి మునక్కాయ సాంబార్ గానికి జాకీలు వేసి ఎలివేట్ చేస్తుంటావు… వాడేమో 5 నిముషాలు తాటపటాయించకుండా మాట్లాడలేని కుష్టి జ్ఞాని. నువ్వు గమ్మునా ఇలాంటి గాసిప్స్ రాసుకో… మిగిలిన వాళ్ళు వాళ్ళ పనులు చేసుకొంటారు..

  5. Nenu backstory teliyakunda just Nayana Tara Angle lo chesthe correct anipinchindi. Kanee, idi chadivaka, inane ayithe mathram, Dhanush has every right to do what he’s doing! I don’t like him but I like his gutsy move against women like her!

  6. ఒరేయ్ వెస్ట్ బేవార్స్ ఛానల్గా సినీ ఇండస్ట్రీ మొత్తం నయనతార నీ సపోర్ట్ గా వున్నారు నువ్వెందిరా ఇలాగ ధనుష్ దగ్గర ఎంత నొక్కవురా

  7. ఒరేయ్ ధనుష్ గా శింబు లా వా….డి వదిలేస్తే అదే నీ మ చుట్టూ తిరుగును…u missed logic

  8. తన సొంత ఫొన్ నుండి తీసిన క్లిప్స్ వడుకున్నాక, ఇంక ఎడవడం ఎందుకు.. ధనుష్ పైన లెటర్ రాసి బజారున పడడం ఎందుకు

Comments are closed.