‘జాతకం’ బాగుంటుందా?

సినిమా హిట్ కావాలంటే నిర్మాత, దర్శకుడు లేదా హీరో ఇలా ఎవరిదో ఒకరి జాతకం బాగుండాలి. ఏకంగా టైటిల్ లోనే జాతకం అని పెట్టేస్తే ఎలా వుంటుందో? ప్రియదర్శి హీరోగా, శివలెంక కృష్ణ ప్రసాద్…

సినిమా హిట్ కావాలంటే నిర్మాత, దర్శకుడు లేదా హీరో ఇలా ఎవరిదో ఒకరి జాతకం బాగుండాలి. ఏకంగా టైటిల్ లోనే జాతకం అని పెట్టేస్తే ఎలా వుంటుందో? ప్రియదర్శి హీరోగా, శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా ఇంద్రగంటి దర్శకత్వంలో తయారవుతున్న సినిమా సారంగపాణి జాతకం. ఈ సినిమా టీజర్ విడుదల చేసారు. అవుట్ అండ్ వినోదాన్నే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. టీజర్ కట్ మొత్తం నవ్వుల మీద, డైలాగ్ కామెడీ మీదే నడిచింది.

కథ లైన్ తెలుస్తూనే వుంది. జాతకాల మీద నమ్మకం వున్న కుర్రాడు. జాతకాలు, నమ్మకాల పిచ్చి, అందమైన అమ్మాయి. ప్రేమ. అంతా బాగానే వుంది. కానీ ఏదో జరిగింది. అది కూడా అతగాడి నమ్మకమైన జాతకానికి. అందుకే ఏదోదో చేసారు. టీజర్ అంతవరకే చెప్పింది.

ప్రియదర్శి, వెన్నెల కిషోర్, వైవాహర్ష అంతా పక్కా కామెడీ ప్యాకేజ్ లా కనిపిస్తోంది. టోటల్ బాడీలో ఆ పార్ట్ నే గుర్తుందా..బి కార్పొరేట్.. డోండ్ డిస్పరేట్, ఉత్తమ కీచకుడు, అండర్ వేర్ ఏ సైడ్ వాడుకోండి.. నేను బి సైడ్ వాడుకుంటా.. పాన్ ఇండియా ఆల్ఫా మేల్ …ఇలాంటి మాంచి ఫన్ డైలాగులు టీజర్ లో పడ్డాయి.

చూడాలి ఈసారి ఎలా వుంటుందో దర్శకుడు ఇంద్రగంటి జాతకం. నిర్మాత కృష్ణప్రసాద్ జాతకం.

4 Replies to “‘జాతకం’ బాగుంటుందా?”

Comments are closed.