ప్రస్తుతం అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్న సినిమాలు పుష్ప-2, గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ కు ఇంకా టైమ్ ఉంది కానీ పుష్ప-2కు మాత్రం అస్సలు టైమ్ లేదు. ఇప్పుడీ రెండు సినిమాలు తమ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ల విషయంలో డైలమాలో పడ్డాయి.
పుష్ప-2 సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను ఎక్కడ నిర్వహించాలనే అంశంపై చాలా పెద్ద డిస్కషన్ నడుస్తోంది. రామోజీ ఫిలింసిటీలో లేదా ఎల్బీ స్టేడియంలో నిర్వహించే అవకాశం ఉందని కొందరు అంటుంటే.. చిత్తూరు లేదా తిరుపతిలో ఫంక్షన్ పెడతారని మరికొందరు చెబుతున్నారు.
హైదరాబాద్ లో ప్రస్తుతం ఆంక్షలు నడుస్తున్నాయి. 28వ తేదీ వరకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ కష్టమంటున్నారు కొందరు. మరికొందరు మాత్రం స్టేడియంలో నిర్వహిస్తే అనుమతులు దొరికే అవకాశం ఉందని చెబుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం, హైదరాబాద్ లో ఆంక్షలు ఎత్తేసిన తర్వాత ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు. ఈ వారంలో ఇది ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఆల్రెడీ చెన్నై (24వ తేదీ), కొచ్చి (27వ తేదీ)లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు లాక్ అయ్యాయి.
అటు గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పై కూడా ఇప్పట్నుంచే చర్చ మొదలైంది. ఈ సినిమా ఫంక్షన్ ను అమరావతిలో నిర్వహించాలనేది మేకర్స్ ఆలోచన. ఇది పెద్ద సమస్య కాదు. ఎటొచ్చి ఈ వేడుకకు పవన్ కల్యాణ్ ను తీసుకురావాలని అనుకుంటున్నారు. అక్కడే సమస్య వచ్చింది.
గేమ్ ఛేంజర్ ఫంక్షన్ కు టైమ్ కేటాయించే పొజిషన్ లో పవన్ కల్యాణ్ ఇప్పుడు లేరు. అందుకే పవన్ ఎప్పుడు టైమ్ ఇస్తే, అప్పుడే ఫంక్షన్ నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి పవన్ తో రామ్ చరణ్ సంప్రదింపులు జరుపుతున్నాడు. త్వరలోనే ఈ రెండు సినిమాల ప్రీ-రిలీజ్ ఫంక్షన్లపై క్లారిటీ వస్తుంది.