మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు పట్టి మరీ తాను అనుకున్నది సాధించుకున్నారు. సొంత జిల్లాపై ఆధిపత్యం పోగొట్టుకోడానికి పెద్దిరెడ్డి సిద్ధంగా లేరు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మొదట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన్ను తప్పించి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని నియమించారు.
ఇదే సందర్భంలో పెద్దిరెడ్డికి ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. కానీ ఆయన సంతృప్తి చెందలేదని తెలిసింది. ఎందుకంటే, సొంత జిల్లాపై ఆధిపత్యాన్ని ఆయన కోరుకుంటున్నట్టు సమాచారం. దీంతో తన అసంతృప్తిని పరోక్షంగా జగన్‌కు వెల్లడించారని తెలిసింది.
ఈ నేపథ్యంలో తాజాగా రీజినల్ కో-ఆర్డినేటర్ల మార్పు జరిగింది. ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా బాధ్యతల్ని కూడా పెద్దిరెడ్డికి అప్పగించడం విశేషం. ఉమ్మడి చిత్తూరు జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డిని గతంలో నియమించిన సంగతి తెలిసిందే. ఆయన్ను మార్చి, పెద్దిరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. వైవీ సుబ్బారెడ్డికి ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు అదనంగా ఉమ్మడి కృష్ణా జిల్లా కో-ఆర్డినేటర్‌గా నియమించడం గమనార్హం.
కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసమే ఈ మార్పు చేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ వద్ద పెద్దిరెడ్డి పంతం నెగ్గించుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ మార్పు వైసీపీకి మంచి చేస్తుందా? లేక వర్గాల్ని మరింత పెంచి పోషిస్తుందా? అనేది కాలం జవాబు చెప్పాల్సి వుంది.
సో సింహాన్ని ఆడించే పెద్ది సింహం అంటావ్
శ్రీ రెడ్డి, బోరుగడ్డ, కోడలి, జోగి రమేష్,సజ్జల, విజయ సాయి, YV సుబ్బా, వేళ్ళని పెట్టుకొని, జగన్ గారు ఏమిచేద్దాం అని?
ఆధిపత్యం…. వైసీపీ లో ఇదొక “కామెడీ” పదార్థం..
అసలు అక్కడ ఏముందని “ఆధిపత్యం” చెలాయించడానికి ..
ఏదైనా సభ పెడితే.. కూర్చోడానికి కుర్చీ కూడా ఇంటి నుండి తెచ్చుకోవాలి..
అదీ వైసీపీ బతుకు ఇప్పుడు..
అదొక ప్రమోషను..దానికి మన ఎంకటి ఎమోషను..
పెద్ది రెడ్డి ఫేస్ ఏమో..వారం నుంచి అవ్వలేదు మోషను..
Super punch lol 😂😂😂
వైసీపీ బాధ్యతలు జగన్ పె-ళ్ళాం భారతి కి ఇచ్చేస్తే అందరు మాట వింటారేమో
vc estanu 9380537747
Call boy works 7997531004
one red flower changed to another red flower. total red flower batch.