ఆది విమ‌ర్శ‌ల‌పై నోరెత్త‌ని మాజీ ఎమ్మెల్యే!

జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి త‌న పార్టీపై చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై ఆయ‌న ప్ర‌త్య‌ర్థి, మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సుధీర్‌రెడ్డి నోరెత్త‌డం లేదు. జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయాల‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్న‌ట్టు డాక్ట‌ర్ సుధీర్ ఉన్నారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు…

జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి త‌న పార్టీపై చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై ఆయ‌న ప్ర‌త్య‌ర్థి, మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సుధీర్‌రెడ్డి నోరెత్త‌డం లేదు. జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయాల‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్న‌ట్టు డాక్ట‌ర్ సుధీర్ ఉన్నారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో రిత్విక్ కంపెనీ ప‌నుల్ని ఆది వ‌ర్గీయులు అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే.

ఆదినారాయ‌ణ‌రెడ్డి తీరుపై స‌ర్వ‌త్రా వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది. వైసీపీ వ‌ర్గీయులు ప‌ని చేస్తుండ‌డం వ‌ల్లే త‌మ వాళ్లు అడ్డుకున్నారంటూ ఆదినారాయ‌ణ‌రెడ్డి డొంక‌తిరుగుడు మాట‌లు చెప్పారు. ఆదినారాయ‌ణ‌రెడ్డి విమ‌ర్శ‌ల్లో నిజం లేద‌ని డాక్ట‌ర్ సుధీర్ మాట్లాడ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ పి.రామ‌సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆదినారాయ‌ణ‌రెడ్డి తీరును త‌ప్పు ప‌ట్టారు. బీజేపీ ఎంపీ సీఎం ర‌మేశ్ గురించి మాట్లాడే ధైర్యం లేకే, సంబంధం లేని త‌మ‌పై నింద‌లు మోపాడ‌ని రామ‌సుబ్బారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయ నాయ‌క‌త్వం కోరుకునే డాక్ట‌ర్ సుధీర్‌, త‌న పార్టీని విమ‌ర్శిస్తే మాత్రం, తిప్పి కొట్ట‌డానికి ముందుకు రాక‌పోవ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

గ‌త ఐదేళ్లు ఎమ్మెల్యేగా అధికారం చెలాయించి, ఇప్పుడు మాత్రం వైసీపీ శ్రేణుల్ని గాలికి వ‌దిలేయ‌డం డాక్ట‌ర్ సుధీర్‌రెడ్డికే చెల్లిందని సొంత పార్టీ నాయ‌కులు త‌ప్పు ప‌డుతున్నారు. క‌ష్ట స‌మ‌యంలో పార్టీకి అండ‌గా వుంట‌నే క‌దా, రేపు మ‌ళ్లీ టికెట్ ఇచ్చేదని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

3 Replies to “ఆది విమ‌ర్శ‌ల‌పై నోరెత్త‌ని మాజీ ఎమ్మెల్యే!”

Comments are closed.