కమెడియన్ అలీ అంటే తెలియని వారు వుండరు. అప్పుడప్పుడు రాజకీయాల్లో మెరుస్తుంటారు. మళ్లీ ఏమీ తెలియనట్టుగా సైలెంట్ అయిపోతుంటారు. మొదటి నుంచి టీడీపీలో ఉన్న అలీ, 2019 ఎన్నికల సందర్భంలో మాత్రం వైఎస్ జగన్ పార్టీలో చేరారు. ఆ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు. అయితే అలీకి నామినేటెడ్ పదవి ఇచ్చి, జగన్ తగిన గౌరవం ఇచ్చారు. వైసీపీ ఎన్నికల్లో ఓడిపోగానే, రాజకీయాలకు అలీ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి ఆయన పేరు రాజకీయంగా వినిపించలేదు. తాజాగా ఆయన పేరు మరోసారి చర్చనీయాంశమైంది. అనుమతుల్లేని భవన నిర్మాణాలు చేస్తున్నారంటూ ఆయనకు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎక్మామిడి గ్రామంలో అలీకి వ్యవసాయ భూమి వుంది. అక్కడ ఫామ్‌హౌస్‌ను అలీ ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి అలీ వెళ్లి వెస్తుంటారు. అయితే ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేపట్టారని రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో అలీకి గ్రామకార్యదర్శి శోభారాణి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
అలీకి నోటీసులు ఇవ్వడం వెనుక ఏవైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? అనే అనుమానం లేకపోలేదు. తెలంగాణలో టీడీపీ అనుకూల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారనే సంగతి తెలిసిందే. గతంలో వైసీపీ కోసం పని చేసిన అలీని టార్గెట్ చేశారా? లేక సాధారణ విధుల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారా? అనేది తేలాల్సి వుంది.
టార్గెట్ చేసి, పక్క రాష్ట్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వెంటాడే అంత సీన్ ఉందా ఇతగాడికి
Ali గారినీ ఎవరూ టార్గెట్ చేయరు. ఆయన రాజకీయ పరంగా ఎప్పుడూ హద్దులు దాటి విమర్శించలేదు. ఎవరినీ పర్సనల్ గా తిట్టలేదు. అలాంటప్పుడు ఎందుకు టార్గెట్ చేస్తారు?
Endukante ayana ycp ni support chesharu kabatti, ikkada telangana lo evari sishyudu unnaro manaku teliyada
Call boy works 7997531004
అలాగే అక్రమ థియేటర్లకు నోటీసులు ఇవ్వండి