జ‌ర్న‌లిస్టుల‌కు సుప్రీం షాక్‌!

ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, జ‌ర్న‌లిస్టుల‌కు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం షాక్ ఇచ్చింది. వాళ్ల‌కు కేటాయించిన భూకేటాయింపుల‌ను ర‌ద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించ‌డం గ‌మ‌నార్హం. జీహెచ్ఎంసీ ప‌రిధిలో హౌసింగ్ సొసైటీల‌కు తెలంగాణ సర్కార్ భూకేటాయింపులు చేసిన…

ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, జ‌ర్న‌లిస్టుల‌కు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం షాక్ ఇచ్చింది. వాళ్ల‌కు కేటాయించిన భూకేటాయింపుల‌ను ర‌ద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించ‌డం గ‌మ‌నార్హం. జీహెచ్ఎంసీ ప‌రిధిలో హౌసింగ్ సొసైటీల‌కు తెలంగాణ సర్కార్ భూకేటాయింపులు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ కేటాయింపుల‌ను స‌వాల్ చేస్తూ రావు బీ చెలికాని సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. గ‌తంలో ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, జ‌ర్న‌లిస్టుల సొసైటీల‌కు చేసిన భూకేటాయింపులను ర‌ద్దు చేస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది.

జవహర్‌ లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇళ్ల‌ స్థలాల్ని తెలంగాణ స‌ర్కార్ కేటాయించిన సంగ‌తి విదిత‌మే. ఈ ఏడాది సెప్టెంబర్ 8న స్థ‌లాల కేటాయింపు పత్రాలను జ‌ర్న‌లిస్టుల‌కు సీఎం రేవంత్‌ రెడ్డి అందించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ప్ర‌జాప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారులు. జ‌ర్న‌లిస్టుల‌కు కేటాయించిన స్థ‌లాలపై సందిగ్ధ‌త నెలకుంది. ఇదిలా వుండ‌గా ప్ర‌భుత్వానికి సొసైటీలు చెల్లించిన డ‌బ్బు వెన‌క్కి ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది.

5 Replies to “జ‌ర్న‌లిస్టుల‌కు సుప్రీం షాక్‌!”

Comments are closed.