చిత్రంగా నిష్క్రమించిన పాట

సంప్రదాయ కుటుంబంలో పుట్టిన కులశేఖర్ జర్నలిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించారు.

చిత్రసీమలో చిత్రం సినిమా ద్వారా పాటల రచయితగా అరంగేట్రం చేసి, సూపర్ హిట్ మూవీతో బ్రహ్మాండమైన కెరీర్ ని స్టార్ట్ చేసిన కులశేఖర్ మంగళవారం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన సినీ గేయ రచయితగా ఎలా టాలీవుడ్ లోకి ప్రవేశించారో అంతే చిత్ర విచిత్రంగా ఆయన జీవితం సాగింది.

చివరికి చిత్రంగానే ఆయన జీవితం ముగిసింది. అది విషాదభరితమైన పాటగా మారింది. చిత్రం మూవీ ఎంతో మంది ఔత్సాహిక టెక్నీషియన్లను ఆర్టిస్టులను టాలీవుడ్ కి పరిచయం చేసింది. అలా పాటల రచయితగా చిత్రసీమలో వెలిగిన కులశేఖర్ విశాఖ వాస్తవ్యుడు. ఆయన సొంత స్థలం సింహాచలం.

సంప్రదాయ కుటుంబంలో పుట్టిన కులశేఖర్ జర్నలిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత పాటల రచయితగా ప్రస్థానం ప్రారభించారు. ఆయన కెరీర్ లో మెగాస్టార్ మృగరాజు, వెంకటేష్ తో ఘర్షణ, వసంతం, జూనియర్ ఎన్టీఆర్ సుబ్బు సినిమాలో ఎన్నో మంచి పాటలు రాశారు. ప్రేమ లేఖ రాశా అన్న సినిమాకు దర్శకత్వం వహించారు

ఒక వైపు కెరీర్ డల్ అయిన టైం లో ఆయనకు మతిమరుపు వ్యాధి వచ్చిందని ఆయన సన్నిహితులు చెప్పేవారు. చాలా కాలం కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్న కులశేఖర్ చివరికి ఈ విధంగా అర్ధ శతాబ్దానికి నూరేళ్ల జీవితాన్ని చాలించడం విశాఖ వాసులకు విషాదం నింపింది. మంచి రచయితగా కులశేఖర్ రుజువు చేసుకున్నారు. కానీ విధి చిన్న చూపు చూసి చిత్రంగా జీవితంతో ఆటలాడింది.

19 Replies to “చిత్రంగా నిష్క్రమించిన పాట”

  1. “ఏ చిలిపి కళ్ళలోన కలవో” ఈయన రాసిన పాత “ఘర్షణ” లో.. ఎన్ని సార్లు ఈ పాట స్టేజ్ షో లలో పాడానో నేను..

    1. మతిమరుపు కాదు. అతని మానసిక స్థితి సరిగ్గ లేదు. సనాతన కుటుంబం
      నించీ వొచ్చిన వ్యక్తి. కానీ దీని వల్ల గుడిలో ఎదో తప్పు చేసాడు.
      అప్పట్లో గొడవలు అయినయ్.
  2. పాత్రికేయన్ని కత్తిలా మలచి డబ్బులు దండుకోకుండా కలంలా వాడి ఉభయభ్రష్టత్వం పొందాడు , పుణ్యగతులకేగాడు. ఎంత చిత్రం!

  3. దొంగతనం కేసులో ఇరుక్కున్న తరువాత ఆయన మతిస్థిమితం లేకుండా తిరిగాడని ఇంకో వెబ్ సైట్ లో చదివాను

Comments are closed.