మోక్షు-ప్రశాంత్.. ఇద్దరికీ తప్పదు!

ఇక్కడ ఒక క్లారిటీ అయితే కనిపిస్తోంది. మోక్షు-ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోలేదు.

నందమూరి మోక్షు-ప్రశాంత్ వర్మ-చెరుకూరు సుధాకర్ ప్రాజెక్ట్ కు సడెన్ గా పాజ్ బటన్ పడింది. తెల్లవారి పూజ అనగా సడెన్ గా కార్యక్రమం ఆగింది. దాంతో రకరకాల స్పెక్యులేషన్లు. ప్రశాంత్ కు మోక్షు కు మధ్య ఏదో జరిగిందని, కాదు, కాదు, మోక్షుకు సినిమా చేయడం అంతగా ఇష్టం లేదని ఇలా చాలా చాలా.

ఇదిలా వుంటే అసలు ఈ ప్రాజెక్ట్ లేదని, దాని బదులు నాగ్ అశ్విన్ సినిమా వుంటుందని ఇంకో వార్త. ఈ లోగా నాగ్ అశ్విన్ తో సినిమా అన్నదే ఫేక్ న్యూస్ అంటూ యూనిట్ వైపు నుంచి కన్ ఫర్మేషన్. ఈలోగా నిర్మాత చెరుకూరి సుధాకర్ టీమ్ వైపు నుంచి ఏమైనా అప్ డేట్స్ వుంటే తామే చెబుతామని ఓ ప్రకటన.

ఇక్కడ ఒక క్లారిటీ అయితే కనిపిస్తోంది. మోక్షు-ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోలేదు. పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి ఓ కొలిక్కి వచ్చాక అఫీషియల్ గా ప్రకటన వస్తుంది. నిజానికి ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కాల్సిందే. ఎందుకంటే ప్రశాంత్ వర్మకు ఇప్పుడు ఇమ్మీడియట్ గా హీరో ఎవరూ అందుబాటులో లేరు. మోక్షు కు కూడా ప్రశాంత్ వర్మ అన్నది మంచి ఆప్షన్.

అందుకే ఈ ప్రాజెక్ట్ బెస్ట్ వన్. పైగా నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా ఖర్చుకు వెనుకాడే వ్యక్తి కాదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి. అందువల్ల అన్ని విధాలా ఈ కాంబినేషన్ అందరికీ బెటర్. అందుకే ఎలాగో అలా దీన్ని వదలకుండా సెట్ చేస్తారనే అనుకోవాలి.

5 Replies to “మోక్షు-ప్రశాంత్.. ఇద్దరికీ తప్పదు!”

Comments are closed.